ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం దేశంలో బ్యాటరీల తయారీ?

ఇక మన దేశంలో  ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల కొరత ఏర్పడకుండా ఇక్కడే బ్యాటరీలు తయారు చేయాలని న్యూ ఢిల్లీకి చెందిన ఓమెగా సీకీ(Omega Seiki) మొబిలిటీ ప్రైవేట్ కంపెనీ భావిస్తోంది. అందుకోసం గాను ఏకంగా ఎనిమిది బిలియన్ల రూపాయలు( 981 మిలియన్ డాలర్లు) పెట్టుబడి కూడా పెట్టనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక న్యూ ఢిల్లీకి చెందిన కంపెనీ Omega Seiki మొబిలిటీ ప్రైవేట్ కంపెనీ దక్షిణాసియా దేశంలో బ్యాటరీలను ఉత్పత్తి చేయడానికి న్యూయార్క్‌లోని లిథియం-అయాన్ సెల్స్ తయారు చేసే స్టార్టప్ iM3NYతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అందుకోసం గాను ఏకంగా రూ. 8 బిలియన్ల ను పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2018 వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ ఒమేగా కంపెనీ స్థానికంగా ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ ట్రైన్‌లను తయారు చేసేందుకు జే సంగ్ టెక్ కొరియాతో కలిసి ఒక జాయింట్ ను కూడా తీసుకొచ్చింది.


ఇండియాలో లిథియం-అయాన్ బ్యాటరీల డిమాండ్ ప్రస్తుతం 3 గిగావాట్ అవర్ ఉంది. ఇది 2030 నాటికి మొత్తం 20 గిగావాట్ అవర్ కు పెరుగుతుందని ఓ అంచనా. ఇక ఇది స్థానికంగా సెల్ తయారీ సామర్థ్యాన్నిపెంచడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తోంది.ప్రస్తుతం మన దేశంలో లిథియం-అయాన్ సెల్ ల ఉత్పత్తి సరిగ్గా లేకపోవడంతో 70% చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి వాటిని నుండి దిగుమతి చేసుకుంటున్నాం.ఇక మహారాష్ట్రలో ఒమేగా తన బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించే ఛాన్స్ ఉంది. మొదట 0.5 గిగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించి ఆ తర్వాత 2 గిగావాట్ల దాకా పెంచే అవకాశం ఉంది. హరియాణాలోని పవర్ ట్రైన్ ప్లాంట్ 2024 వ సంవత్సరంలో 10,000 యూనిట్లను ఇంకా అలాగే నాల్గవ సంవత్సరం నాటికి మొత్తం 100,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: