ఇంతకంటే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మరొకటి లేదేమో?

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా కంపెనీలు కూడా చాలా కొత్తగా ఆలోచిస్తున్నాయి.మార్కెట్ లో ఈ వెహికల్స్ కి ఉన్న డిమాండ్ ను చాలా బాగా ఉపయోగించుకుంటున్నాయి. మిగతా కంపెనీల నుంచి పోటీని చాలా ఈజీగా తట్టుకునేందుకు సరికొత్త అప్డేటెడ్ మోడళ్లను వినియోగదారులకు అందించేందుకు అన్ని పెద్ద కంపెనీలతో పాటు పలు స్టార్టప్ కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఐగోవైజ్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్ కి స్టాండ్ అవసరం లేదు.. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అందుకే ఆ కంపెనీ ఈ స్కూటర్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ల సిరీస్ లో ఎస్ యూవీగా  పేర్కొంది. ఇక ఈ స్కూటర్ ఏంటి? దాని ఫీచర్లు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఐగోవైజ్ మొబిలిటీ అనే ఈ స్టార్టప్ కంపెనీ బిగో ఎక్స్4 పేరుతో ఈ సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను రిపబ్లిక్ డే సందర్భంగా లాంచ్ చేసింది. మీరు ఒకవేళ కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ బిగో ఎక్స్4లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే  ఏకంగా 150 కిలోమీటర్లు వెళ్తుంది. ఇంకా అంతేకాకుండా ఫైర్ రెసిస్టెన్సీ కలిగిన లైఫ్ పీ04 బ్యాటరీలను కూడా ఇందులో ఉపయోగించారు.ఇందులో స్మార్ట్ బీఎంఎస్, అడాస్, కొల్లిజన్ డిటెక్షన్ అలారం, డేటా డరైవెన్ రైడింట్ ప్యాట్రన్ డిటెక్షన్ ఇంకా అలాగే ఐఓటీ అండ్ అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీస్ వంటి సూపర్ డూపర్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే కంపెనీ జీరో డౌన్ పేమెంట్ ఇంకా అలాగే వెహికల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వంటివి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం పలు ఫైనాన్స్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతోంది.


దీని బూట్ స్పేస్ మొత్తం 60 లీటర్లు ఉంటుంది. ఇంకా ఇందులో ఇన్‌బిల్ట్ పిలియన్ ఫుట్‌రెస్ట్, స్నేసియస్ ఫ్లాట్ ఫ్లోర్ లెగ్ రూమ్ ఇంకా అలాగే ట్రిపుల్ డిస్క్ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ట్విన్ వీల్ ఇంటిగ్రేటెడ్ పవర్ ట్రెయిన్ టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పని చేస్తుంది. దీని వల్ల ట్రాఫిక్‌లో ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. బ్యాలెన్స్ చేయాల్సిన పని అస్సలు లేదు. అలాగే స్టాండ్ అవసరం కూడా ఉండదు. ఈ వెహికల్ కింద పడిపోదు. రివర్స్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.దీని ధర వచ్చేసి రూ. 1.1 లక్షల నుంచి స్టార్ట్ కావొచ్చు. ఐదేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల దాకా వారంటీ ఉంటుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో దీని తయారీ ప్లాంటు ఉంది. కంపెనీ దీని ప్రిబుకింగ్స్ కూడా ప్రారంభించింది.మీరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా దీన్ని కొనుగోలు చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: