బుల్లి పిట్ట: కేఫ్ట్ ఫీచర్ ని పరిచయం చేయబోతున్న వాట్సప్..!!

Divya
దేశవ్యాప్తంగా నిత్యం ప్రతి ఒక్కరు ఉపయోగించే యాప్ లలో వాట్సప్ యాప్ కూడా ఒకటీ. సోషల్ మీడియాలో యాప్స్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నారు యూజర్స్. అయితే ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు ఎక్కువగా వాట్సాప్ లోని ప్రతి ఒక్కరు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దీంతో వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో అప్డేట్లను సైతం ప్రకటిస్తూ వస్తోంది. నిత్యం లక్షలాదిమంది ఉపయోగిస్తున్న ఈ సోషల్ మీడియా యాప్ లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ఫీచర్ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇప్పుడు తాజాగా మరొకసారి కొత్త ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వాట్సాప్ సంస్థ కెఫ్ట్ అనే కొత్త ఫీచర్ను డెవలప్ చేయబోతోంది. ఈ ఫీచర్ ద్వారా డిలీట్ చేయబడిన మెసేజ్లను సేవ్ చేసుకోవచ్చట. ఈ సరి కొత్త ఫిచర్ ఇంకా బీటా వినియోగదారులకు కూడా అందుబాటులో రాలేదని సమాచారం. త్వరలోనే మనందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి  కొంతమంది వాట్సాప్ యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్ ఫీచర్ ని ఉపయోగిస్తున్నారు. ఇది 24 గంటలు ఏడు రోజులు 90 రోజులలో మెసేజ్లను ఆటో డిలీట్ చేసే ఆప్షన్ కలదు.

అయితే ఈ విధంగా వాట్సాప్ లో వారు పంపిన మెసేజ్లు వాటంత అవే  మాయమవుతున్నాయి. అందుచేతనే కెప్టె అనే ఫీచర్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది వాట్సాప్ సంస్థ. ఈ ఫీచర్ వల్ల డిలీట్ చేసిన మెసేజ్లను ఆటో సేవ్ చేస్తుంది అలాగే కనిపించకుండా పోయిన మెసేజ్లు కూడా సేవ్ చేయడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అయితే వినియోగదారులు సందేశాలను రిజర్వ్ చేయకూడదనుకుంటే వారు వాటిని అన్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వెంటనే అవి చాట్లో కనిపించవు ఈ ఫీచర్ ద్వారా సేవ్ చేయబడిన మెసేజ్లు వాటి యొక్క బుక్ మార్క్ సింబల్ ద్వారా గుర్తించబడతాయి. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: