గుడ్ న్యూస్: మైక్రోసాఫ్ట్ విండోస్ 12 వచ్చేస్తోంది?

టెక్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. అదేంటంటే మైక్రోసాఫ్ట్ నుంచి మరో వెర్షన్ విండోస్ వచ్చేస్తోంది.ఇప్పటికే 11 వెర్షన్లను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీ .. తన విండోస్ 12 కి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేసింది. లాస్ వేగాస్ లో జరుగుతున్న కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో దీనికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ విండోస్ 12 అప్ డేట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..విండోస్ 12 కి సంబంధించిన ఓ అప్ డేట్ ను సీఈఎస్ 2023లో ఏఎండీ అనౌన్స్ చేసింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను వచ్చే 10 సంవత్సరాల లోపు వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ప్రైమరీ ఫీచర్లను మాత్రమే పొందుపచినట్లు కంపెనీ వెల్లడించింది. వాటిలో అత్యంత శక్తి వంతమైన చాటాబోట్ ఇంకా చాట్ జీపీటీ(ChatGPT)ని తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.


దీని కోసం ప్రత్యేక ఆర్టిఫీషియల్ మోడల్ ను తీసుకురానున్నట్లు ఏఎండీ తెలిపింది. దీనిని సీపీయూకి బదులుగా జీపీయూ లింక్ చేసేలా ప్లాన్ చేస్తుంది.ఇక జూమ్ మీటింగ్స్ నిర్వహించే క్రమంలో డెస్క్ టాప్ లలో ఎదురయ్యే కొన్ని ప్రాబ్లెమ్స్ కి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసి పరిష్కరించవచ్చని ఏఎండీ చెబుతోంది. బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయినట్లు కనిపించడం ఇంకా ఎప్పుడూ కెమెరా వైపు చూస్తూ ఉండాల్సి రావడం వినియోగదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఫస్ట్ వీటిని అధిగమించేలా కొత్త సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు.ఇంకా ఈ విండోస్ 12 వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసరికి మరో పది సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఏఎండీ నెక్ట్స్ జనరేషన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన పర్సనల్ కంప్యూటర్లు ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: