బుల్లి పిట్ట:హ్యుందాయ్ బ్రాండ్ నుంచి మినీ కార్..!!

Divya
దిగ్గజ కార్ల కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ కార్ల సంస్థ కూడా ఒకటి. ఎక్కువగా ఇష్టపడే వాహనాల లిస్టులో ఈ బ్రాండ్ కూడా కలదు. ఆటో ఎక్స్పో ఈవెంట్ వచ్చే ఏడాది జనవరిలో జరగబోతోంది. ఈవెంట్ 2023 గ్రేటర్ నోయిడాలో జరగబోతోంది. ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్, కియా వంటి అనేక పెద్ద కంపెనీల తమ వాహనాలను ప్రదర్శించబోతున్నారు. వీటితో స్టార్టప్ కంపెనీలు కూడా ఉన్నాయి.హ్యుందాయ్ మోటార్స్ ఇండియా క్రెటా ఫేస్ లిస్ట్ , సెడాన్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.హ్యుందాయ్ బ్రాండ్ నుంచి సరికొత్తగా విడుదల కాబోతున్న కార్లలో ఆటో ఇండస్ట్రీలో ఎప్పుడు రాకప్ ది టౌన్గా నిలుస్తోంది.

ప్రస్తుతం ఈ కారు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రారంభానికి ముందే పలు చర్చలు కూడా జరుగుతున్నాయి. కొత్తగా రాబోతున్న కారు పేరు హ్యుందాయ్ AI-3. మిని SUV కాన్సెప్ట్ కారుతో తయారు చేశారు. MICRO SUV ఆటో ఎక్స్పోజ్ దాని కాన్సెప్ట్ తో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ వాహనం ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. పండుగ సీజన్ ఈ వాహనానికి విడుదల కాబోతున్నట్లు సమాచారం. A13 కారు దేశం లోనే అతి చిన్న చౌకైన కారు అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇది గ్లోబల్ స్పెక్ కాస్పర్ SUV కంటే కాస్త పెద్దదిగా ఉంటుందని ఇండియాలో ప్రవేశించడానికి దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తుందని తెలియజేశారు. గత సంవత్సరం రూ.1400 కోట్ల రూపాయలకు పైగా పెట్టిపడి పెట్టిందని తెలియజేశారు.హ్యుందాయ్ గ్రాండ్ I-10 నియోస్ హ్యాచ్ ప్యాక్ ప్లాట్ఫారంతో రూపొందించబడుతోందట. ఇక ఈ వాహనం 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్ తో రాబోతోంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలదు. cng ఆప్షన్ తో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇందులో ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టం తో పాటు ఆటోమేటిక్ ఏసీ యూనిట్ పవర్ విండోస్ రివర్స్ కెమెరా ఎలక్ట్రికల్ సర్దుబాటు వంటి మొదలైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: