ఐఫోన్ యూజర్లకు జియో గుడ్ న్యూస్?

ఇక మన దేశంలో ప్రస్తుతం 4జీ సేవలు కొనసాగుతున్న విషయం అందరికి కూడా తెలిసిందే. ఈమధ్య వివిధ టెలికాం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించడం జరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల కల ఎట్టకేలకు నెరవేరుతోంది.టెక్నాలజీ అనేది పెరుగుతున్న కొద్ది దేశంలో ఇంటర్నెట్ సదుపాయం వేగం కూడా చాలా బాగా పెరుగుతోంది. 4జీ కంటే చాలా ఎక్కువ రెట్టింపుతో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఇతర నెట్‌వర్క్‌ల కంటే కూడా జియో నెట్వర్క్ అయితే మరింత స్పీడ్ గా దూసుకుపోతోంది.అలాగే తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా 5జీలో వేగాన్ని కూడా పెంచింది. ఇంకా అలాగే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా తలెత్తకుండా మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక జియో ఐఫోన్‌ 12 తర్వాత వెర్షన్‌ మొబైల్‌ ఉన్నవారికి అపరిమిత డేటాలో 5జీ సర్వీస్ లను ప్రారంభించింది.ఇక వినియోగదారులు ఈ రోజు నుంచి జియో ట్రూ 5జీ సేవలను అపరిమిత డేటాతో పొందుతారని రిలయన్స్‌ జియో గురువారం నాడు తెలిపడం జరిగింది.


ఇక వినియోగదారులు తాజా iphone iOS క్యారియర్ సెట్టింగ్‌లకు అప్‌డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే అపరిమిత 5g వినియోగాన్ని ప్రారంభించడానికి కంపెనీ వినియోగదారుల సంఖ్యలపై జియో వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా అందించింది. ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 మ్యాక్స్‌, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో ఇంకా అలాగే ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఉన్న వారు జియో 5జీ సేవలను యాక్సెస్‌ చేసుకోవాలని కూడా తెలిపడం జరిగింది. కాబట్టి ఐఫోన్ యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి.ఇక నవంబర్ మొదటి వారంలో యాపిల్‌ తన ఐఫోన్‌ పరికరాలను భారతదేశంలో 5g కనెక్టివిటీని కంపెనీ బీటా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లకు తిరిగి ఇచ్చేలా అప్‌డేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆపిల్ నవంబర్ 11 వ తేదీన iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను విడుదల చేయడం ప్రారంభించినట్లు ధృవీకరించడం జరిగింది.అలాగే సాఫ్ట్‌వేర్‌ను iOS 16.2 లేదా తర్వాతి వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని ఇంకా ఆపై సెట్టింగ్‌ల నుండి 5Gని ట్రన్ చేసి, చివరకు 5g స్టాండలోన్‌ని ఆన్ చేయాలని జియో వినియోగదారులను కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: