బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ35 వెలకే ఐఫోన్ -13 మొబైల్..!!

Divya
మొబైల్ వినియోగదారులకు lఎక్కువగా ఐఫోన్ మొబైల్ ఉపయోగించాలంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా సరే ఐఫోన్ మొబైల్ ను వినియోగించుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఐఫోన్ సంస్థ తాజాగా పలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటోంది. అయితే ధర విషయంలో ఈ మొబైల్ కొనాలనుకునే వారు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఫ్లిప్ కార్ట్ లో యాపిల్ ఐఫోన్ -13 పై భారీ ఆఫర్ ను అందిస్తున్నది.

ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ గా పలు రికార్డులను సైతం సృష్టించింది. ఫ్లిప్ కార్ట్ లో బిలియన్ డేస్ సందర్భంగా ఈ స్మార్ట్ మొబైల్ పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ -13 అసలు ధర చూసుకుంటే రూ.69,900 రూపాయలు కాగ ఆఫర్లు ఈ మొబైల్  రూ.35,399 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ మొబైల్ న ఇలా ఇంత తక్కువ ధరకే ఎలా పొందాలో తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ లో సేల్ లో భాగంగా రూ.3,901 డిస్కౌంట్ ను అందిస్తుందా దీంతో ఈ మొబైల్ రూ.65,999 ఉన్నది.

ఇక తర్వాత IDFC క్రెడిట్ కార్డు పైన మరొక రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.62,999 లభిస్తుంది. అయితే పాత మొబైల్ ఎక్సైజ్ కింద గరిష్టంగా రూ.27,600 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఐఫోన్ 13 మొబైల్ రూ.35,399 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.1 ఇంచెస్ అంగుళాలు కలదు. ఇక వీటితోపాటు కెమెరా విషయానికి వస్తే 12+12 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా కలదు. ఇక వీటితోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 12  ఫ్రంట్ కెమెరా కలదు. ఇక బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: