బుల్లిపిట్ట: సరికొత్త ఫీచర్ తో రానున్న రియల్ మీ..9 నిమిషాల్లోనే..!

Divya
తాజాగా మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే.. మీకోసం ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు.  అదిరిపోయే ఫోన్ ఒకటి మార్కెట్లోకి రాబోతోంది. పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది.  ఈ క్రమంలోని మీరు కొత్త ఫోన్ కొనాలని ఆలోచించేటప్పుడు ఒక్క క్షణం ఆగండి..  ముఖ్యంగా ఈ కొత్త అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. ఈ  ఫీచర్లతో రియల్ మీ కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తోందని సమాచారం.

మునుపెన్నడు లేని విధంగా మరే ఫోనులోనూ లేని ఫీచర్ తో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. రియల్ మీ త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న స్మార్ట్ ఫోన్ రియల్ మీ GT నియో 5.. తాజాగా ఈ ఫోన్ ఫీచర్లు విడుదలయ్యాయి. ఇకపోతే ఇందులో అదిరిపోయే బ్యాటరీ స్పీడ్ ఉండనుందని తెలుస్తోంది.  కంపెనీ సెప్టెంబర్ 8న రియల్ మీ 10 ప్రో ప్లస్ ఫోన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే నియో సీరీస్ లో ఇప్పుడు మరో కొత్త ఫోను ఆవిష్కరించనుందని సమాచారం.
రియల్ మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చింది . ఇప్పుడు నియో 5 ఫోను ఈ సీరియస్ లోనే తీసుకొచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఈ సిరీస్ కింద మార్కెట్లోకి వచ్చిన రెండు ఫోన్ లలో 150 W చార్జింగ్ స్పీడ్ కూడా ఉంది అంతేకాదు 50% బ్యాటరీ కేవలం ఐదు నిమిషాల్లోనే 100% బ్యాటరీ 15 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది అని కూడా కంపెనీ తెలిపింది . ఇకపోతే ఇప్పుడు వచ్చే ఈ ఫోన్లో ఇంతకుమించి ఫీచర్లో ఉన్నాయని తెలుస్తోంది. రియల్ మీ జీటీ నియో ఫైవ్ స్మార్ట్ ఫోన్లో 240 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , 150W చార్జింగ్ సపోర్టుతో రెండు స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. 240 W ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ బ్యాటరీ చేయవచ్చు అని కూడా కంపెనీ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: