బుల్లి పిట్ట: తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో 5G స్మార్ట్ ఫోన్స్..!

Divya
ప్రస్తుతం భారతదేశంలో 5g నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలోని పలు మెట్రో నగరాలలో 5g సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే నెట్వర్క్ సేవలను ఉపయోగించుకోవాలంటే మన దగ్గర 5g సిమ్ కార్డుకు సపోర్ట్ చేసే మొబైల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మీరు కూడా 5g సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. కొన్ని మొబైల్ కంపెనీలు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ధరకే 5g సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వీటి ధర కేవలం రూ. 20, 000 లోపే ఉండడం గమనార్హం.
సాంసంగ్ గాలక్సీ M13 5G:
ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గజమైనా అమెజాన్లో ఈ ఫోన్ ధర రూ.13,999.. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది.  6.5 అంగుళాల HD ప్లస్ ఎల్సిడి డిస్ప్లే తో 90 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. 5000 ఎం ఏ హెచ్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత సాఫ్ట్వేర్ పై పనిచేస్తుంది.  కెమెరా విషయానికి వస్తే.. 50 mp ప్రధాన కెమెరా..2MP మైక్రో కెమెరా తో పాటు 5MP ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది.

ఒప్పో A74 5G:
దీని ధర రూ.14,990 ధరతో ప్రారంభం అవుతుంది . 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి హైపర్ కలర్ స్క్రీన్ తోపాటు 90 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో.. 48 mp ప్రధాన కెమెరా +2MP మ్యాక్రో +2MP డెప్త్ లెన్స్ , 8MP ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది.  వీటితోపాటు మరెన్నో 5g  స్మార్ట్ ఫోన్లు మీకు తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: