బుల్లి పిట్ట: మొబైల్ డేటా త్వరగా అయిపోవడానికి కారణాలు ఇవే..!!

Divya
ప్రతి ఒక్కరం కూడా స్మార్ట్ మొబైల్ లేనిదే ఏ పని చేయలేమని చెప్పవచ్చు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా సమాచారం తెలియాలి అన్న సోషల్ మీడియాలో వెంటనే తెలిసిపోతూ ఉన్నది. ఎంత ఎక్కువగా మనం మొబైల్స్ ని ఉపయోగిస్తామో మొబైల్స్ కూడా అంత త్వరగా పాడైపోతూ ఉంటాయి. అందుకు కారణం ముఖ్యంగా మొబైల్స్ లో ఉండే యాప్లేని చెప్పవచ్చు. అయితే బ్యాటరీ పనితీరు డేటా వినియోగం వంటివి కూడా ఈ యాప్స్ పైన ఆధారపడి ఉంటాయి. పలు రకాల యాప్స్ ఎక్కువగా డేటాని ఉపయోగిస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాల యాప్స్ మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం యూజర్స్ ఉపయోగించే మొబైల్ లను ఉపయోగిస్తున్నారని గూగుల్ ప్రకటించింది.

ఇందులో భాగంగా మొబైల్ బ్యాటరీ డేటాను త్వరగా ఖాళీ చేస్తున్న కొన్ని యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు యూసర్లు కూడా వెంటనే ఆ యాప్లను డిలీట్ చేయాలని టెక్ దిగ్గజ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆ యాప్ ల వల్ల ముఖ్యంగా చార్జింగ్ చాలా స్పీడ్ గా అయిపోతుందట. గూగుల్ 16 యాప్ లు యూజర్లు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే.. ఒక రిక్వెస్ట్ సహాయంతో ఒక రిమోట్ కాన్ఫిగరేషన్ను డౌన్లోడ్ చేస్తాయి ఆ తర్వాత మరికొన్ని సహాయంతో డెవలపర్ యూజర్లకు తెలియకుండానే బ్యాగ్రౌండ్ లో పలు వెబ్సైట్లు ఓపెన్ చేసి పలు యాడ్స్ పైన క్లిక్ చేస్తూ ఉంటాయి.

ఇదంతా మొబైల్ ఉపయోగిస్తున్న యూజర్లకు తెలియకుండానే జరుగుతుందని టెక్ దిగ సంస్థలు తెలుపుతున్నారు. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోవడమే కాకుండా డేటా త్వరగా అయిపోతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలుపుతోంది. నిషేధించబడిన యాప్స్ విషయానికి వస్తే.. జామ్ కోడ్, బుసాన్బస్, కరెన్సీ కన్వర్టర్, హై స్పీడ్ కెమెరా, ఫ్లాష్ లైట్, ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడర్, మెమో క్యాలెండర్ తదితర యాప్స్  ఈ జాబితాలో ఉన్నాయి వీటిని మొబైల్ లో ఉంటే డిలీట్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: