నాసా: మార్స్ పై కీలక ఆధారాలు సేకరణ?

దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మన భూమి లాంటి గ్రహాలు చాలా వున్నాయి. శాస్త్రవేత్తలు నిత్యం వేరే గ్రహాల గురించి అక్కడ నివసించే ప్రాణుల గురించి నిత్యం ఏదో ఒక పరిశోధన అనేది చేస్తూ వున్నారు.అంగారక గ్రహం మీద జీవం ఉనికి ఉందా? ఫ్యూచర్ లో అక్కడ మనుషులు జీవించే అవకాశం ఉందా? నాసా సేకరించిన ఆనవాళ్లు ఈ పరిశోధనలలో చాలా కీలకంగా మారాయి.మార్స్ గ్రహం మీద జీవాన్వేషణ దిశగా అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సాగిస్తున్న పరిశోధనలో మరో కీలక ముందడుగు పడింది. ఒక విధంగా చెప్పాలంటే మరో మైలురాయి అనాల్సిందే. నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్‌ రోవర్‌ కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. అంగారకుని మీద జెజెరో క్రేటర్‌లో కనిపించిన పురాతన నది డెల్టాలాంటి ప్రాంతంలో ఈ పరిశోధన సాగింది. అక్కడ ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ సహా నాలుగు కీలక నమునాలను సేకరించింది పర్సెవరెన్స్‌ రోవర్‌.. వందల కోట్ల ఏళ్ల కిందట ఇక్కడో నది ప్రవహించిందని భావిస్తున్నారు.మార్స్ పై జెజెరో క్రేటర్ డెల్టా 45 కిలోమీటర్లు వెడల్పుతో ఉంది.


సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది. ఇక్కడి నుంచి సేకరించిన ఇసుకరాయి శిలల్లో ఆర్గానిక్‌ పరమాణువులు ఉన్న బురదను పర్సెవరెన్స్‌ రోవర్‌ గుర్తించింది. ఇందులోకార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌తో పాటు నైట్రోజన్‌, పాస్ఫరస్‌, సల్ఫర్‌ అణువులున్నాయని ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్న శాస్త్రవేత్త కెన్‌ ఫార్లే తెలిపారు. ఇందులో జీవ ఆధారాలు ఉన్నాయని కచ్చితంగా చెప్పలేకున్నా భవిష్యత్తులో జరిగే పరిశోధనలకు ఇదే కీలకంగా మారనున్నాయని అంటున్నారు.అంగారక గ్రహంపై ఇప్పుడు లభించిన ఆర్గానిక్‌ నమూనాలను భూమిపై పురాతన జీవాలకు సంబంధించిన శిలాజాలను సంరక్షించేందుకు ఉపయోగిస్తారు. ఈ నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన తర్వాత లోతైన అధ్యయనం చేస్తామంటున్నారు. నాసా ప్రయోగించిన ఈ పర్సెవరెన్స్‌ రోవర్‌ గతేడాది ఫిబ్రవరిలో అంగారక గ్రాహంపై విజయవంతంగా లాండ్‌ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: