బుల్లి పిట్ట: అమెరికా నుంచి ఐఫోన్ మొబైల్స్ తెచ్చుకునే వారికి షాక్.. ఎందుకంటే..!!

Divya
ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన ఐఫోన్ మొబైల్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు అయితే దీని ధర ఎక్కువగా ఉండడం చేత కొంతమంది మాత్రమే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఐఫోన్-14 మోడల్ ని ఇతర దేశాలలో విడుదల చేసింది ఆ సంస్థ.. అయితే ఇక్కడున్న వారు ఇతర దేశాల నుంచి తమ బంధుమిత్రులతో ఈ మొబైల్స్ ను తెచ్చుకుందామనుకుంటూ ఉంటారు అయితే అక్కడ తక్కువగా ఉండడం చేత ఎక్కువగా అందరూ అలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పటినుంచి విడుదలైన ఐఫోన్ మొబైల్స్ అలా తెచ్చుకుంటే చాలా ఇబ్బంది పడినట్లే అన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

అమెరికాలో విడుదల కాబోతున్న ఐఫోన్ 14 మొబైల్ లలో సిమ్ ట్రే ఉండదట.. తాజాగా మార్కెట్లకు రాబోతున్న ఈ మొబైల్ సంబంధించి అమెరికా సరికొత్త వెర్షన్ను విడుదల చేస్తోంది. అంటే ఇందులో ఈ సిమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ సిమ్ టెక్నాలజీ మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఇందులో సిమ్ము లేకుండా ఒక యూనిట్ నెంబర్ను మాత్రమే కలిగి ఉన్న టెక్నాలజీతో ఈ మొబైల్ ని తయారు చేయడం జరుగుతోంది.

ఫిజికల్ గా ఇందులో సిమ్ లేకుండా కూడా మొబైల్ ని ఉపయోగించుకోవచ్చు ఈ టెక్నాలజీ వాడి ఐఫోన్లలో ఇ- సిమ్ మాత్రమే ఉంచబోతోంది. దీంతో మదర్ బోర్డు కు కూడా లింక్ చేసీ దీన్ని తయారు చేయడం జరుగుతోంది. ఇ- సిమ్ టెక్నాలజీ అందుబాటు ఇంకా మన దేశంలో రాలేదు. అందువల్ల ఇతర దేశాల నుంచి తెప్పించుకున్న మొబైల్ ఇక్కడ వాడుకోవడం కుదరదు. అమెరికాలో మొబైల్స్ అక్కడ చాలా తక్కువగానే ఉంటాయి మన దేశంలో పన్నుల మూలంగా ఇతర బ్రాండెడ్ కలిగిన ప్రాజెక్టులు కూడా ధరలు ఎక్కువగానే ఉంటాయి అందుచేతనే డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుని కస్టమర్లు ఎక్కువగా అక్కడ నుంచి ఐఫోన్లను తెప్పించుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: