బుల్లి పిట్ట:మొదటిసారి సూర్యకాంతితో నడిచే ఎలక్ట్రిక్ కార్..!!

Divya
ప్రస్తుతం ఉన్న కార్లు అన్ని ఎక్కువగా పెట్రోల్, డీజిల్ వంటి వాటితోనే ఎక్కువగా నడుస్తున్నాయి దీంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ బైకులు, కార్లు ఎక్కువగా తీసుకోవడం జరుగుతోంది వినియోగదారులు. ఇక ఎలక్ట్రిక్ కార్లు కాకుండా సోలార్ తో నడిచే కార్లను కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జర్మనీ కి చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సోనో మోటార్స్ సాధారణ ప్రజల కోసం మొదటిసారిగా ఒక సోలార్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఇక ఆ సంస్థ తెలిపిన నివేదికల ప్రకారం సోనో సీయోన్  ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసినట్లుగా ఆ కంపెనీ తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్లు భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లుగా కంపెనీ సంస్థ తెలియజేయడం జరిగింది. ఇక సెప్టెంబర్ ఒకటి వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్రకారం 20,000 కంటే ఎక్కువ గా ఈ  కార్స్  కోసం బుకింగ్ చేసుకున్నట్లుగా తెలియజేయడం జరిగింది. సుమారుగా ఒక్కో కస్టమర్ దగ్గర్నుంచి రూ.1.58 లక్షల రూపాయలు అందుకున్నట్లుగా సోనో మోటార్స్ తెలియజేశారు.
ఇక ఈ సోనో సియోన్ వెహికల్ ధర విషయానికి వస్తే 25,126 యూరో గ నిర్ణయించారు. అయితే మన కరెన్సీ ప్రకారం దీని విలువ.. రూ.19.93 లక్షలు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు 305 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళుతుందని కంపెనీ తెలియజేయడం జరిగింది. వచ్చే ఏడు సంవత్సరాలలో 2,57,000 సోనో సియాన్ కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలియజేశారు. ఇక సోలార్ వల్ల దాదాపుగా 100 కు పైగా కిలోమీటర్ల వరకు నడపగలిగే శక్తి ఉన్నట్లు ఆ కంపెనీ అధినేతలు తెలిపారు. ఒకవేళ ఆకాశంలో సూర్యుడు తరచుగా ఉన్నట్లు అయితే ఈ పరిస్థితి రెండింతలు మేర పని చేస్తుందని కంపెనీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: