బుల్లి పిట్ట: ఈ నెలలో రాబోతున్న ఐఫోన్ 14 .. ధర ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!!

Divya
ప్రస్తుతం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న మొబైల్ ఏమిటంటే ఐఫోన్ 14 ఈ సిరీస్ గల మొబైల్ ను ఈ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే ఈవెంట్లో ఐఫోన్ -14 సిరీస్ తో పాటు, పలు కంపెనీ స్మార్ట్ వాచ్ ల తో సహా అనేక ఉత్పత్తులను కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 14 పైన ప్రతి ఒక్కరు దృష్టి ఉంటోంది. తాజాగా కొత్త ఐఫోన్ మొబైల్ నాలుగు మోడల్స్ ను కంపెనీ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో ధరలు ఫీచర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 14: ఇందులో పెద్దగా మార్పు ఏమో ఉండదు కానీ.. నాచ్ డిస్ప్లే  డ్యూయల్  కెమెరా సెట్ అప్ తో వస్తోంది. ఐఫోన్ 13 లాగే ..6.1 అంగుళాలు డిస్ప్లేతో ఈ మొబైల్ విడుదల కాబోతోంది.
ఐఫోన్-14 ప్రో:
ఈ మొబైల్లో పలు రూపకల్పనలో చాలా మార్పులు చూడవచ్చునట ఇక డిస్ప్లే విషయంలో కూడా 6.7 అంగుళాలు ఓఎల్ఈడి డిస్ప్లే తో కలదు. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ వంటి LTOP టెక్నాలజీ తో తయారు చేయబడినట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 14, 14 ప్రో : ఫీచర్ల విషయానికి వస్తే.. చీప్ సెట్ రాబోయే ఐఫోన్ 14 ప్రోలో ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక ఐఫోన్ 12 మొబైల్ మాత్రమే ఈ మొబైల్స్ కూడా ఉండనున్నాయి ఇందులో శాటిలైట్ కనెక్టివిటీ, ఆస్ట్రో ఫోటోగ్రఫీ, గొప్ప ఫ్యూచర్లు ఈప్రోలు అందుబాటులో ఉండునట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 48 మెగా పిక్సెల్ త్రిబుల్ కెమెరా.
ఇక ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 14 మొబైల్ భారతదేశంలో రూ.79,000 ఉండనున్నట్లు సమాచారం ఇక ఐఫోన్ 14 ప్రో విషయానికి వస్తే.. రూ.89,000 రూపాయలు ఉండనున్నట్లు సమాచారం . ఈ మొబైల్ సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: