బుల్లి పిట్ట: మొదటిసారి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. ధర ఫీచర్స్ అదుర్స్..!!

Divya
వాచ్చుల పరిశ్రమలో ఒక బ్రాండ్ గా వెలుగుతున్న ప్రముఖ బ్రాండెడ్ ఫాస్ట్రిక్ కూడా ఒకటని చెప్పవచ్చు.. తన ఫస్ట్ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ ను మొదటిసారిగా విడుదల చేసింది. ఫాస్ట్ట్రాక్ రిప్లై క్స్ ప్లే పేరుతో ఒక కాలింగ్ స్మార్ట్ వాచ్ ను తీసుకురావడం జరిగింది. గతంలో సాధారణ స్మార్ట్ వాచ్లను సైతం అందుబాటులోకి తీసుకు వచ్చినప్పటికీ ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం బ్లూటూత్ కాలింగ్, ఫీచర్ తో కలిగిన ఒక వాచ్ ని విడుదల చేయడం ఇదే మొదటిసారి. మంచి సర్కులర్ షేప్ డిజైన్.. అమౌలెడ్ డిస్ప్లే, అల్యూమినియం కేసు ఈ స్మార్ట్ వాచ్ ఎంతో ఆకర్షనీయంగా ఉన్నది ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫాస్ట్ట్రాక్ రిప్లెక్స్+ప్లే స్మార్ట్ వాచ్ ధర రూ.6995 రూపాయలకి విడుదల చేసింది అయితే ఈ కామర్స్ అమెజాన్ సంస్థలో రూ.1000  తగ్గింపుతో  రూ.5,995 దొరకే అందుబాటులో ఉన్నది అలాగే ఫాస్ట్ట్రాక్ ఆఫ్లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక అంతే కాకుండా ఇందులో బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో కలదు. ఇక ఈ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ ఫ్యూచర్ విషయానికి వస్తే..
ఫాస్ట్ట్రాక్ రిప్లెక్స్+ప్లే స్మార్ట్ రౌండ్ షేప్ లో కలదు.1.3 ఇంచుల కామారెడ్డి డిస్ప్లే కలదు.. సిలికాన్ స్టాఫ్స్ ను కలిగి ఉన్నది. ఇక ఇందులో బ్లూటూత్ కాలింగ్,ఫ్యూచర్ కలదు. ఇన్బిల్ట్ గా  మైక్ ,స్పీకర్లు కూడా కలదు. ఈ స్మార్ట్ వాచ్ కి మొబైల్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కాల్స్ వచ్చినప్పుడు నేరుగా మాటు వాచ్ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ నుంచి మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. డయల్ కూడా చేసుకోవచ్చు. ఇక హెల్త్ పరంగా హార్ట్ బీట్ ,బ్లడ్ ఆక్సిజన్ ,బ్లడ్ ప్రెజర్ వంటి హెల్త్ ఫ్యూచర్లను కూడా అందించగలదు. మ్యూజిక్ కెమెరాను కూడా ఈ స్మార్ట్ వాచ్ లో కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఏడు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: