బంపర్ ఆఫర్ : 15 వేల ధరలోపు ఆపిల్ ఐఫోన్?

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ ఐఫోన్‌ లకు వున్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎప్పటికప్పుడు యాపిల్‌ కంపెనీ బెస్ట్‌ ఫీచర్‌లతో ఐఫోన్‌ సిరీస్‌ లను లాంచ్‌ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌ లాంచ్‌కు సమయం ఆసన్నమైంది.త్వరలోనే ఈ లేటెస్ట్ ఐఫోన్‌లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. సాధారణంగా ఐఫోన్‌ కొత్త సిరీస్‌ లాంచ్‌ అయ్యే ముందు.. అంతకుముందు ఉన్న ఫోన్‌లపై బెస్ట్‌ డీల్స్‌ అనేవి అందుబాటులోకి వస్తుంటాయి. ఐఫోన్‌ 14 లాంచ్‌కి ముందుకు కూడా ఇలాంటి బెస్ట్‌ ఆఫర్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఐఫోన్ 14 సిరీస్ లాంచ్‌కు ముందు ఐఫోన్ ఇతర మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లు ఇంకా అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తున్నాయి. అతి తక్కువ ధరకు ఐఫోన్‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఐఫోన్‌ను వినియోగించాలని కోరుకుంటున్నవారు ఐఫోన్‌ SEని బెస్ట్‌ ఆఫర్‌లో పొందవచ్చు.ఐఫోన్‌ 14 లాంచ్‌కు సంబంధించి ఐఫోన్‌ SE కూడా తెరపైకి వచ్చింది.


చాలా మంది వ్యక్తులకు యాపిల్‌ ఐఫోన్‌ వినియోగించాలనే కోరిక ఉంటుంది. కానీ ఎక్కువ బడ్జెట్‌ కారణంగా వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఐఫోన్ SE ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్‌ SE ఫోన్‌పై రూ.17,000 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. వినియోగదారులు అన్ని డిస్కౌంట్లను కలిపి రూ.12,999కి ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 2020 ఐఫోన్ ముఖ్యమైన మోడల్ ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.యాపిల్‌ ఐఫోన్‌ SE స్మార్ట్‌ఫోన్‌ను 2020లో లాంచ్‌ చేసింది. ఇందులో A13 బయోనిక్ చిప్‌సెట్, 4.7-అంగుళాల రెటినా HD డిస్ప్లే ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను హోమ్ బటన్ సర్క్యులర్‌ స్పేస్‌లోకి ఇంటిగ్రేట్‌ చేశారు. డిస్‌ప్లేకి వైడ్‌ బెజెల్‌లు ఉన్నాయి. ఐఫోన్‌ SE 2020 సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్ వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌, IP67 రేటింగ్‌తో ఇది లాంచ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: