బుల్లి పిట్ట: మీ మొబైల్ హ్యాక్ అయ్యిందా లేదా ఇలా తెలుసుకోండి..!!

Divya
ఈమధ్య పలు స్మార్ట్ ఫోన్లు వాడకం భారీగానే పెరిగిపోయింది. దీంతో హ్యాకర్లు కూడా స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వాటిని హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో మన మొబైల్ హ్యాకింగ్ బారిన పడిందో లేదో తెలుసుకోవడం కోసం కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1).మన మొబైల్లో బ్యాటరీ వేగంగా అయిపోతుందంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాక్ అయిందని అనుమానించవచ్చు.
2). మన మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ సడన్ గా ఆగిపోవడం వంటివి జరిగితే మీ మొబైల్ లో వైరస్ దాడి చేసిందని లేదా మొబైల్ హ్యాక్ చేయబడిందని గుర్తించవచ్చు.
3). మొబైల్ డేటా ఉపయోగించకుండానే వేగంగా అయిపోతుంది అంటే.. మన మొబైల్ హ్యాక్ అయింది ఏమో అని సందేహించాలి ఎందుచేత అంటే ఒక మొబైల్ సంబంధించిన యూజర్ వ్యక్తిగత సమాచారం ఇతరులకి చేరితేనే ఆ మొబైల్ గురించి సైబర్ నేరగాళ్లు అందులో ఉండే డేటాని సైతం సేకరించుకుంటూ ఉంటారు అందువల్ల ఇంటర్నెట్ వేగంగా ఖర్చవుతుంది.
4). మొబైల్స్ హ్యాకర్ల బారిన పడినప్పుడు మన మొబైల్ పనిచేయడం చాలా తగ్గిపోతుంది. మన వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు పూర్తిగా వెళ్లిందని చెప్పవచ్చు. అంతేకాకుండా మనకు తెలియకుండానే మన కాంటాక్ట్లు మెసేజ్లు వారికి వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు ఇవే కాకుండా మరికొన్ని అంశాలు
1). అసాధారణంగా ఉండే యాప్ లు  తెరుచుకుంటూ ఉంటాయి.
2). ఊహించని విధంగా మన డివైస్ మొబైల్ చాలా వేడెక్కుతుంది.
ఇలాంటి తరుణంలో ఫోన్ హ్యాకింగ్ గురైనప్పుడు ఏం చేయాలంటే.. కొన్ని యాంటీ వైరస్ యాప్ లను వాడాలి కొన్ని ప్రముఖ బ్రాండెడ్ ఫ్రీ ప్రొటెక్షన్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి.. వాటిలో కొన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక అంతే కాకుండా ఆండ్రాయిడ్ ఐఫోన్ మొబైల్స్ లను రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. ఇక మనం వాడే మొబైల్స్ లో యాప్ లకి  అనుమతి ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి అనుమతులు లేని వాటిని డిలీట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: