బుల్లి పిట్ట: ఈ మొబైల్ హ్యాక్ చేస్తే.. రూ.16 కోట్లు మీ సొంతం.. సవాలు విసురుతున్న యాపిల్ సంస్థ..!!

Divya

యాపిల్ స్మార్ట్ మొబైల్, ఐపాడ్  వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాటిని రక్షించుకోవడానికి తాజాగా సరికొత్త ప్రయత్నాలను మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈసారి WWDC ఈవెంట్ లో లాక్ డౌన్ మోడ్ ఫ్యూచర్ ని కూడా పరిచయం చేస్తోంది. ఈ లాక్ డౌన్ మోడ్ అనే భద్రత టెక్నాలజీకి సంబంధించినది. అయితే ఇది కేవలం ఐఫోన్ వినియోగదారులు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతోంది. రాజకీయ నాయకులు న్యాయవాదులు ఇతర విఐపి భద్రత కోసం ఈ సామర్థ్యాన్ని పెంచడానికి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతోందట.

పెగాసన్  కుంభకోణం జరిగిన తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాల పాటు యాపిల్ సరికొత్త ఫ్యూచర్ పై పరిశోధనలు చేసి ప్రవేశపెట్టింది. ఇజ్రాయిల్ కు చెందిన NSO గ్రూపుకు చెందిన పెగాసన్ స్పైవేర్ హ్యాక్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎంతోమంది పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఇతరులను టార్గెట్  చేయడం జరిగింది ఇందుకోసం యాపిల్ సంస్థ కు కొన్ని సామాన్లు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త లాక్ మోడ్ IOS -16 వెర్షన్ అందుబాటులోకి ఉంచింది. అయితే వీటిని ఆపిల్ యొక్క ఐఫోన్ ఐపాడ్లు మరియు MAC కంప్యూటర్లలో మాత్రమే పని చేస్తుందని తెలిపారు.

ఈ ఫీచర్ ఈ ఫోన్లలో ఐపాడ్ లో ఉన్నంతవరకు యాపిల్ డివైస్లు హ్యాక్ చేయలేరని తెలియజేశారు. ఒకవేళ హ్యాకర్లు లాక్ డౌన్ ఫ్యూచర్ ను హ్యాక్ చేసినట్లు అయితే యాపిల్ సంస్థ నుండి రెండు మిలీయన్ డాలర్ల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఇది మన భారతదేశ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.16 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈసారి ఆపిల్ సంస్థ చాలా గట్టిగానే హ్యాకర్లకు సవాలు విసురుతోందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజులలో ఈ మొబైల్ ని హ్యాక్ చేస్తారో లేదో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: