బుల్లి పిట్ట: రూ.10 వేల లోపల లభించే బెస్ట్ స్పీకర్స్ ఇవే..!

Divya
ఈ మధ్యకాలంలో చాలావరకు సినిమాలన్నీ కూడా ఓటిటీ వేదికగా విడుదలవుతున్న నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి సినిమా చూడాలని ఆసక్తి చూపుతున్నారు. అందుకే స్మార్ట్ టీవీలో సినిమాలు చూస్తూ మంచి సౌండ్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో మార్కెట్లోకి కొత్తగా స్పీకర్స్ కి మంచి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో రోజురోజుకు మ్యూజిక్ ప్రియుల ఆసక్తులకు అనుగుణంగా రకరకాల స్పీకర్లు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. ఇకపోతే రూ.10వేల లోపు లభించే బెస్ట్ టవర్ స్పీకర్స్ ను గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..
ఫిలిప్స్ SPA 9075B/94 బ్లూటూత్ టవర్ స్పీకర్:
ఫిలిప్స్ కంపెనీకి చెందినటువంటి ఈ స్పీకర్ 75 W అవుట్ పుట్ పవర్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు బ్లూటూత్ స్పీకర్ 2.1 ఛానల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండడం గమనార్హం. ఇది 40 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ ను కూడా కలిగి ఉండడం మరింత ఆసక్తికరమని చెప్పవచ్చు. ఇక ఈ స్పీకర్లకు బ్లూటూత్ సౌకర్యం కూడా కలిగి ఉంది. అలాగే ఎఫ్ఎం రేడియో ఆస్వాదించే అవకాశం కూడా కల్పించడం జరిగింది.  ఫ్లిప్కార్ట్ లో దీని ధర రూ. 9,990 గా నిర్ణయించారు. ఇక ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా లభిస్తుంది.
గిజ్ మోర్ GIZ st 5000 బ్లూటూత్ స్పీకర్..
ఈ కంపెనీకి చెందిన ఈ స్పీకర్ 50W సౌండ్ ఔట్ పుట్ ను అందిస్తుంది. అంతేకాదు మంచి బేస్ ని కూడా కలిగి ఉండడం ..ఇక స్టీరియో ఛానల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్న ఇది అఫర్టబుల్ దరలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక ఈ బ్లూటూత్ టవర్ స్పీకర్ ధర కేవలం రూ. 3,499. ఇక వైర్డ్ మైక్ కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించబడింది. రిమోట్ కంట్రోల్ బ్లూటూత్  ఫీచర్ తో మార్కెట్లో విడుదల కావడం గమనార్హం. ఇక మీరు బ్లూటూత్ వైర్లెస్ మ్యూజిక్ స్క్రీనింగ్ కోసం ఎంజాయ్ చేస్తున్నట్లు అయితే ఫ్లిప్కార్ట్ లో మరొక వేరియెంట్ ధర 7,795రూపాయలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: