స్మార్ట్ ఫోన్ ఒక పెను భూతం... ఈ విషయాలు మైండ్ లో పెట్టుకోండి ?

VAMSI
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారే లేరు. ఐఏఎస్ ఆఫీసర్ నుండి సైకిల్ తొక్కే సామాన్యుడి వరకు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ అని, గేమింగ్ అని, ఎంటర్టైన్మెంట్ అని, వాట్స్ యాప్ ఇలా ప్రతి దానికి స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. యువత అయితే అస్సలు ఫోన్స్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోతున్నారు. ఇక వర్క్ ఫ్రం హోం పేరిట అందరి చేతుల్లోనూ ఫోన్లే దర్శమిస్తున్నాయి. అయితే ఇలా గంటల తరబడి ఫోన్లు వాడటం వలన ఎన్ని ప్రమాదాలు వస్తాయన్న విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ విషయం కొందరికి తెలిసినా అన్ని గాలికి వదిలేసి మళ్ళీ ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. అయితే ఫోన్ల నుండి అధికంగా రేడియేషన్ వెలువడుతుంది. ఈ రేడియేషన్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అంటే అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ అయిదు విషయాలను గుర్తుంచుకుంటే మనం కొంత వరకు స్మార్ట్ ఫోన్ల వలన కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు.
1. ఆల్టర్ నేటివ్ గా తక్కువగా ఫోన్లు మాట్లాడటం అలవాటు చేసుకోండి, వాటికి బదులుగా వాట్సాప్ లోనో లేదా హెడ్ ఫోన్స్ వంటి వాటి ద్వారా ఫోన్ మాట్లాడటం ద్వారా కొంత వరకు రేడియేషన్ ప్రభావం నుండి తప్పించుకోవచ్చు.
2. స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు డార్క్ మోడ్ లో పెట్టుకోవడం కూడా ఒక మంచి అలవాటే.
3. రాత్రి సమయం పడుకునే ముందు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడుకోండి. చాలా మంది ఫోన్లను అలారం లా వాడుతూ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు. దీని వలన మనపై ఈజీగా రేడియేషన్ ప్రభావం పడుతుంది.    
4. ఫోన్ సిగ్నల్ 24 గంటలు ఫోన్ వాడకండి. వీలయినంత వరకు ఫోన్ ను దూరంగా ఉంచడం చూసుకోండి. ఖాళీగా ఉంటే చాలా మంది పక్కనే పెట్టుకుని పాటలు వినడం వంటివి చేస్తుంటారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు ఫోన్ ని దూరంగా ఉంచడం చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: