బుల్లి పిట్ట: సమ్మర్ లో మీ మొబైల్ వేడెక్కుతోందా అయితే ఈ చిట్కాలు చాలు..!!

Divya
వేసవి కాలం తో స్మార్ట్ మొబైల్స్ చాలా వేడెక్కుతూ ఉంటాయి . వాటి వల్ల ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం వల్ల మొబైల్స్ చాలా తొందరగానే వేడెక్కుతాయి. అయితే ఇలా వేడెక్కడం వల్ల కొంతమంది గేమ్ యూజర్స్ వీటిని ఉపయోగించుకోలేక పోతుంటారు. మరి కొంతమంది కాల్స్ మాట్లాడడం లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా వేడెక్కడం వల్ల బ్యాటరీ పేలే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్ వల్ల ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.
1). మొబైల్ కూలర్ సహాయం:
గేమింగ్ ఎక్కువగా ఆడే యూజర్ల కోసం మొబైల్ వేడి కాకుండా ఫోన్ కూలర్లను వంటి పరికరాలను రూపొందించబడ్డాయి దీని సహాయంతో వినియోగదారులు తమ మొబైల్ ను వేడెక్కకుండా చూసుకోవచ్చు.
2). ఎక్కువ యాప్లు ఉండకూడదు:
మనం ఉపయోగించే స్మార్ట్ మొబైల్ లో బ్యాక్గ్రౌండ్ అవసరం లేకపోయినా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని తీసి వేయడం మంచిది. లేదంటే అవి అలాగే రన్ అవుతూ ఉండడం వల్ల మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది.
3). ఎయిర్ ప్లెన్ మోడ్ ని ఆన్ చేయండి:
మొబైల్ వేడి నీ  తగ్గించడానికి మీరు ఎయిర్ ప్లెన్ మోడ్ ను ఆన్ చేసుకోవచ్చు ఇది మీ మొబైల్ బ్యాటరీ ఆదా చేయడమే కాకుండా అధిక వేడి సమస్య నుండి చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది.
4). మొబైల్ బ్యాక్ కవర్ మార్చుట:
మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్ లో నిరంతరం వేడెక్కడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.. అందుచేతనే మొబైల్ కవర్ ను తీసివేయడం మంచిది.  కొన్నిసార్లు మొబైల్ కొన్న బ్యాక్ కవర్ వల్ల కూడా వేడెక్కడం జరుగుతూ ఉంటుంది.
5). మొబైల్ డేటా ఆఫ్ చేయడం:
మొబైల్ హీట్ అయ్యే సమస్య అధికంగా ఉంటే మొబైల్ డేటా ను వెంటనే ఆఫ్ చేయాలి. అధికంగా ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల మీ బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: