బుల్లిపిట్ట: ఆండ్రాయిడ్ యూజర్స్ చేసే.. కావన్ మిస్టేక్స్ ఇవే..!!

Divya
ఈ రోజుల్లో స్మార్ట్ మొబైల్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేరు.. వారి అవసరాలను బట్టి ఎంతో మంది ఈ స్మార్ట్ మొబైల్స్ తోనే తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అయితే మొబైల్ ఉపయోగించేటప్పుడు కేవలం మనకి తెలియకుండానే కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము.. అందులో అత్యధికంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉపయోగించే వారే ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసేటటువంటి కామన్ మిస్టేక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
1). మొబైల్ వినియోగిస్తున్న అప్పుడు మనం ఖచ్చితంగా ఎప్పుడు ఒకసారైనా బ్యాక్ అప్ చేసుకోవడం మంచిది. కానీ మనం అలాంటివి ఎక్కువ గా చేయము. అయితే ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. అందులో ఉండే డేటా మొత్తం పోకుండా ఉండాలి అంటే బ్యాకప్ చెయ్యాల్సిందే.

2). ముఖ్యంగా మనం గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి కాకుండా మరి ఇంక ఎక్కడినుండైనా.. యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లు అయితే వాటన్నిటిని థర్డ్ యాప్స్ కింద పరిగణిస్తారు. ఇలా చేసుకోవడం వల్ల మీ మొబైల్ కి హాని కలిగించవచ్చు.. అందుచేతనే డౌన్లోడ్ చేసేటప్పుడు కేవలం ప్లే స్టోర్ లో ఉండేటివి డౌన్లోడ్ చేసుకోవాలి.
3). ప్రతి ఒక్కరూ మొబైల్ లాక్ స్క్రీన్ మనకి సులువుగా ఉండే విధంగా 0000,1234, వంటి పాస్వర్డ్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఇప్పుడు ఫింగర్ప్రింట్, పేస్ అన్ లాక్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాము. అందుచేతనే మనం పాస్వర్డ్ ను కూడా మరింత బలమైన పాస్వర్డ్ ను  ఉంచుకోవడం మంచిది.
4). కొన్ని యాప్స్ మనకి APK ఫైల్స్ ద్వారా కూడా దొరుకుతూ ఉంటాయి.. వీటిని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవడం వల్ల.. చాలా ప్రమాదకరం అవుతుందట. వీటివల్ల ఒకసారి మన మొబైల్ ని హ్యాకింగ్ చేయవచ్చు.
ఇక ఇవే కాకుండా ఏదైనా యాప్ లో మనకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: