టెస్లా చరిత్ర ఏంటి? ఎందుకంత ఫేమస్?

ఇక ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లాను ఒక సంచలనంగా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. 2003 వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూస్తు నేడు ఒక ట్రిలియన్ డాలర్స్ కంపెనీగా అవతరించడం జరిగింది. అదే ఇండియన్ రూపాయల్లో చెప్పాలంటే టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ 74 లక్షల కోట్లు. అంటే ప్రపంచంలో చాలా దేశాల జీడీపీ కంటే ఈ కంపెనీ మార్కెట్ విలువే చాలా ఎక్కువట.ఇక నేడు చాలా మంది కూడా టెస్లాను స్థాపించింది ఎలాన్ మస్క్ అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఎలాన్ మస్క్ కాదు టెస్లాను స్థాపించింది మార్టిన్ ఇబర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు అమెరికన్ ఇంజినీర్లు అట. 2004లో పెట్టుబడులు పెట్టడం ద్వారా టెస్లాలో మెజారిటీ షేర్ హోల్డర్ అయ్యాడు ఎలాన్ మస్క్. ఇక 2008లో టెస్లా కంపెనీకి సీఈఓ అయ్యాడు. ఫ్యూచర్ లో రవాణా రంగాన్ని మరింత పర్యావరణ హితంగా తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని చెబుతోంది టెస్లా కంపెనీ.ఫిజిక్స్ మీద బాగా పట్టు ఉన్న వాళ్లకు ఈ టెస్లా అంటే ఏంటో తెలిసే ఉంటుంది. టెస్లా అంటే అయస్కాంత క్షేత్ర సామర్థ్యాన్ని కొలిచే ఒక యూనిట్. ప్రముఖ ఎలక్ట్రిక్ ఇంజినీర్ నికోలస్ టెస్లా పేరు మీదుగా ఆ యూనిట్‌కు టెస్లా అని పేరు పెట్టడం జరిగింది. నికోలస్ టెస్లా సేవలకు గుర్తుగా టెస్లా అని తమ కంపెనీకి పేరు పెట్టుకున్నారు ఈ కంపెనీ ఫౌండర్స్.

ఇక టెస్లా ఈనాడు ఒక ఫేమస్ బ్రాండ్. ఇండియాలో కూడా దానికున్న క్రేజ్ చాలా ఎక్కువే. మా దేశంలోకి టెస్లా కార్లను ఎప్పుడు తెస్తారంటూ తరచూ ఎలాన్ మస్క్‌ను సోషల్ మీడియా ద్వారా అడుగుతూనే ఉంటారు మన ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల అభిమానులు.టయోటా, ఫోర్డ్ లాంటి ఆటో మొబైల్ కంపెనీలు కొన్ని దశాబ్దాలలో సాధించిన సక్సెస్‌ను కేవలం 18 ఏళ్లలో సాధించింది టెస్లా కంపెనీ. ఇవాళ మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీ టెస్లా.టెస్లా ముందు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. కానీ టెస్లాకు ఎందుకు ఇంత క్రేజ్ అంటే దీని అట్రాక్టివ్ డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీ ఇంకా అలాగే మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ... ఈ మూడు కూడా టెస్లాను ఇతర కంపెనీలకంటే భిన్నంగా నిలిపాయి.

అంతేకాదు టెస్లా కంపెనీ తయారు చేసేది కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే.ఎలక్ట్రిక్ కారు అనగానే స్పీడ్ ఇంకా అలాగే పెర్ఫామెన్స్ తక్కువ అనే ఇమేజ్‌ను కూడా బద్దలు కొట్టింది టెస్లా కంపెనీ. మంచి ఇన్నోవేటివ్ టెక్నాలజీతో బ్యాటరీలను మరింత సెఫ్టీగా ఇంకా మరింత పవర్ ఫుల్‌గా మార్చింది టెస్లా కంపెనీ.ఇక మోడల్-ఎస్‌ను తీసుకుంటే గనుక దాని రేంజ్ సుమారు 630 కిలోమీటర్లు ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 300 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఇక అందుకే టెస్లా అంటే అంత ఫేమస్. ఇండియాలో కనుక టెస్లా స్టార్ట్ అయితే ఇక టెస్లా దూకుడిని ఆపలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: