జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ తీసుకోబోతున్నారా? ప్లాన్స్ ఇవే !

Vimalatha
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలో జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను ప్రారంభించింది. నెలవారీ రూ.399 ప్రారంభ ధరతో ఈ ప్లాన్‌లు స్టార్ట్ చేశారు. కంపెనీ వినియోగదారుల కోసం 6 నెలల, 2 నెలల (వార్షిక) ఆప్షన్ ను అందిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ల కోసం ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కంపెనీ ఎటువంటి ఇన్‌స్టాలేషన్ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేయదు. రిలయన్స్ జియో ఫైబర్ భారతదేశంలో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. జియో ఫైబర్ వేగం 30 Mbps నుండి 1 Gbps వరకు ఉంటుంది. ఈ సేవ కంపెనీ స్వంత JioTV+ సేవ, అపరిమిత వాయిస్ కాలింగ్, 15 OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి ఇస్తున్నారు.
రిలయన్స్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను నెలకు రూ. 399 నుండి నెలకు రూ. 8,499 వరకు అందిస్తోంది. ఇది Netflix, Amazon, Prime Video, Disney+ Hotstar VIP, sony Liv, Zee5, Voot Select, Lionsgate Play, sun NXT, hoichoi, Discovery+, JioCinema, Shemaroo, AltBalaji, Eros Now, Voot Kids వంటి OTT సేవలను అందిస్తుంది.
బ్రాంజ్ ప్లాన్
జియో ఫైబర్ బ్రాంజ్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్ ధర 30 mbps ఇంటర్నెట్ వేగంతో రూ. 399. ఇది భారతదేశంలో ఎక్కడైనా అపరిమిత కాలింగ్‌తో పాటు 3,300 FUP డేటా పరిమితితో వస్తుంది. బ్రాంజ్ ప్లాన్‌లో OTT యాప్‌ల సభ్యత్వం లేదు.
సిల్వర్ ప్లాన్
సిల్వర్ ప్లాన్ 100 Mbps వేగంతో వస్తుంది. ఇందులో అపరిమిత కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్‌తో రాదు. ఇది నెలకు రూ.699కి లభిస్తుంది.
గోల్డ్ ప్లాన్
జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్ నెలకు రూ. 999తో అపరిమిత కాలింగ్, 150 Mbps FUP వేగం డేటా ప్రయోజనంతో వస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ మినహా 11 OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
డైమండ్ ప్లాన్
డైమండ్ ప్లాన్ ధర రూ. 1,499, 300 Mbps వరకు అపరిమిత ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను, నెలకు రూ. 1,500కి 12 OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తుంది.
డైమండ్+ ప్లాన్
ఈ ప్లాన్ ధర రూ.2,499, ఇది గరిష్టంగా 500 Mbps వేగంతో 4,000 GB డేటాను అందిస్తుంది. టెలికాం కంపెనీ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను, 12 OTT యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ప్లాటినం ప్లాన్
ప్లాటినం ప్లాన్ కింద కంపెనీ నెలకు రూ. 3,999 చొప్పున 1 Gbps వేగంతో 7,500GB డేటాను అందిస్తుంది. అదనంగా ఇది అపరిమిత వాయిస్ కాల్‌లతో వస్తుంది. 12 OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
టైటానియం ప్లాన్
టైటానియం ప్లాన్ ధర రూ. 8,49. ఇది కంపెనీ అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్లాటినం ప్లాన్ లాగానే ఒకే ఒక్క తేడాతో వస్తుంది. అదే డేటా FUP. ఇది 1 Gbps వరకు వేగంతో 15,000 GB నెలవారీ డేటాను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: