15 రూపాయలతో 100 కిలోమీటర్లు ప్రయాణించే స్కూటర్..!!

KSK

ప్రపంచం రోజురోజుకీ మార్పు చెందుతుంది. కొత్త కొత్త టెక్నాలజీ లో రావడంతో గతంలో గంటల్లో జరగాల్సిన పనులు ప్రస్తుతం క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రపంచం రోజురోజుకీ సాంకేతికంగా అభివృద్ధి చెందటంతో ప్రయాణాలు కూడా చాలా సులభతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు రకరకాల వాహనాలు సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి దింపుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వాలకు డీజిల్ మరియు పెట్రోల్ ధరల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజలు కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలపై తమ దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలను తయారుచేసి వినియోగదారులకు అందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు పలు ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులోకి రావటం జరిగాయి. అయితే తాజాగా అలాంటి వాటిలో ఒకటి అంపీర్ సంస్థ మాగ్నస్ ప్రో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్  స్కూటర్ ను మార్కెట్ లోకి దింపింది.  కేవలం 15 రూపాయల ఖర్చుతో వంద కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా ఈ స్కూటర్ తయారవ్వటం జరిగింది. కంపెనీవారు ఈ స్కూటర్ కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా తయారు చేయడం జరిగింది. 55 కిమీ గరిష్టవేగంతో ప్రయాణం చేయవచ్చు. 

భారతదేశంలోని 200 నగరాల్లోని షోరూమ్ లలో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ షోరూం ధర రూ. 73,900 గా నిర్ణయించారు. మామూలుగా అయితే పెట్రోల్ ద్వారా నడిచే వాహనాలకు సంవత్సరానికి రూ. 27000 వరకు ఖర్చు అవుతుంటే, ఈ మాగ్నస్ ప్రో  స్కూటర్ వలన కేవలం రూ.  2700 మాత్రమే ఖర్చు అవ్వటంతో డబ్బు చాలా ఆదా చేసినట్లు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: