సీరీస్ వచ్చింది.. క్లీన్ స్వీప్ మిగిలింది..!

shami
ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా ఇప్పుడు జరుగుతున్న మూడు వన్ డేల సీరీస్ ను కూడా సొంతం చేసుకుంది. మొదటి వన్ డే విన్ అవగా జరిగిన రెండో వన్ డేలో కూడా టీం ఇండియా విక్టరీ సాధించింది. అయితే 50 ఓవర్లకు 381 పరుగులు సాధించి ప్రత్యర్ధులకు భారీ గెలుపు లక్ష్యాన్ని పెట్టినా సరే ఇంగ్లాండ్ జట్టు దాన్ని అందుకునే ప్రయత్నం చేసింది. 


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 20 పరుగులకే ఓపెనర్లు రాహుల్, ధావన్ లతో పాటుగా వన్ డౌన్ వచ్చిన విరాట్ కొహ్లిని కూడా పెవిలియన్ బాట పట్టించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడి వీరోచిత బ్యాటింగ్ తో చెరో సెంచరీతో యువరాజ్ సింగ్ 150, ధోని 134 పరుగులతో ఇంగ్లాండ్ కు మంచి టార్గెట్ ఉంచారు. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జాసన్ రాయ్ 84 పరుగులతో దూకుడుగా ఆడగా.. జో రూట్ కూడా హాఫ్ సెంచరీతో భారత్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. ఇక 128 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన తర్వాత దిగిన ఇయాన్ మోర్గాన్ వీరోచిత ఇన్నింగ్స్ తో సెంచరీ బాదాడు.


ఒకానొక దశలో మ్యాచ్ చేజారిందేమో అన్న రీతిలో బ్యాటింగ్ చేశారు. ఇక చివరి ఓవర్లలో మ్యాచ్ బాగా ఉత్కంటతగా సాగింది. మోర్గాన్ అవుట్ అయ్యాడు కాని లేకుంటే కచ్చితంగా ఇంగ్లాండ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఏది ఏమైనా సరే భారీ లక్ష్యం ముందుంచి సత్తా చాటిన భారత ఆటగాళ్లు ముఖ్యంగా జట్టుకి అవసరమైనప్పుడు తమ బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న యువరాజ్, ధోనిలు విజయంలో కీలకమయ్యారు. మూడు మ్యాచ్ ల సీరీస్ లో రెండు మ్యాచ్ లు విన్ అయిన టీం ఇండియా ఇక మిగిలిన ఆ మూడో వన్ డే కూడా విన్ అయితే క్లీన్ స్వీప్ అయినట్టే. మరి ఆ అవకాశం ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇస్తారో లేదో చూడాలి. మూడో వన్ డే ఆదివారం జరుగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: