ఢిల్లీ పంత్ ని అందుకే వదిలేసింది.. కోచ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌ హేమంగ్ బదానీ రిషభ్ పంత్ గురించి ఒక పిడుగు లాంటి వార్త బయట పెట్టారు. ఆయన ఢిల్లీ జట్టు నుంచి ఎందుకు వెళ్ళు వెళ్లిపోవడానికి డబ్బే కారణం అంటూ షాకింగ్ విషయాలు చెప్పాడు. 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆడుతున్నాడు పంత్‌. అయితే ఈ టాలెంటెడ్ ప్లేయర్ ను 2025 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ముందు ఢిల్లీ జట్టు వదిలిపెట్టింది. ఈ వేలంలో పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సైతం పంత్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ, లక్నో జట్టు ఇంకా ఎక్కువ ధర పలికింది. అయినా, పంత్ స్వయంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉండాలని అనుకోలేదని బదానీ చెప్పాడు. తన విలువ 18 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉందని పంత్ భావించాడు. అందుకే, అతను వేరే జట్టులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ హేమంగ్ బదానీ ఈ విషయం గురించి చెబుతూ "రిషభ్ పంత్‌ని వదులుకోవాలని మేము అస్సలు భావించలేదు అతనితో చాలా చర్చలు కూడా జరిపాము. కానీ, పంత్ మరింత డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. అందుకే, అతను వేలంలో పాల్గొని, తాను అనుకున్నట్లే ఎక్కువ డబ్బుకు పలికాడు. నిజమైన ప్రతిభావంతుడికి ఏం కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ వేలం నిరూపించింది." అని అన్నాడు.


పంత్ మాత్రం తాను డబ్బు కోసమే జట్టు మారలేదని చెప్పాడు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్, టీమ్ క్రికెట్ గేమ్‌ని చూసే తీరే తనకు లేదని పంత్ చెప్పాడు. అదే అతను జట్టును వదలడానికి కారణమని వివరించాడు. అయితే ఇందులో ఎవరి మాటలు నమ్మాలో తమకు తెలియడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏదైనా ఢిల్లీ టీం ను వదిలి మంచి పని చేశాడు పంత్‌. అతనికి ఇప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అయితే పొందిన డబ్బులకు తగిన పర్ఫామెన్స్ కనబరచాల్సిన ఒత్తిడి అతనిపై కచ్చితంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: