ఐపీఎల్ : రోహిత్ తో ఓపెనింగ్ చేసేది.. ఈ పవర్ హిట్టరేనట?
ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలనే విషయంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో మాట్లాడుతూ, తిలక్ వర్మ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాలని కైఫ్ సూచించారు. సూర్యకుమార్ యాదవ్ తన సాధారణ స్థానం అయిన మూడవ స్థానంలో కొనసాగవచ్చని, హార్దిక్ పాండ్య నాలుగో లేదా ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విల్ జాక్స్ తర్వాత వచ్చి బ్యాటింగ్ చేయవచ్చని కూడా కైఫ్ అన్నారు. "తిలక్ వర్మ, రోహిత్ శర్మ ఈసారి ఓపెనింగ్ చేయాలి," అని కైఫ్ అన్నారు. "సూర్యకుమార్ యాదవ్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. హార్దిక్ పాండ్య నాలుగు లేదా ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. విల్ జాక్స్ అతని తర్వాత బ్యాటింగ్ చేయవచ్చు." అని అభిప్రాయపడ్డాడు.
ముంబై ఇండియన్స్ జట్టుకు యువ ఆటగాళ్లు అవసరమని మహమ్మద్ కైఫ్ అన్నారు. ముఖ్యంగా వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఉన్న రోబిన్ మిన్జ్, నమన్ ధీర్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వేలం మొదటి రోజు ముంబై ఇండియన్స్ జట్టు అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, రెండో రోజు బలమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంతో బాగా రాణించిందని కైఫ్ అన్నారు. దీంతో వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బాగా ఆడే అవకాశం ఉంది. అయితే, ఇంకా ఓపెనర్‌ను ఎవరుగా ఎంచుకోవాలనేది నిర్ణయించాల్సి ఉంది