సూర్య కుమార్ యాదవ్ సంస్కారానికి నెటిజన్స్ ఫిదా.. కాలర్ ఎగరేసుకుంటున్న ఫ్యాన్స్?
సూర్యకుమార్ యాదవ్ భారతదేశ జండా పట్ల చూపించిన ఈ గౌరవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ ప్రేమికులు ఆయన ఈ ప్రవర్తనను ఎంతగానో ప్రశంసించారు. క్రికెట్ మైదానంలో విజయం సాధించడమే కాకుండా, ఆట పట్ల ఆయనకున్న గౌరవాన్ని కూడా ఎలా ప్రదర్శించాలనే దానికి సూర్యకుమార్ యాదవ్ ఒక ఉదాహరణగా నిలిచారు.
అసలు ఏం జరిగిందంటే, ఈ టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను రవి బిష్ణోయ్ అద్భుతంగా క్యాచ్ చేసి పెవిలియన్ చేర్చగా, సూర్యకుమార్ సంబరాలు చేసుకోవడానికి వెళ్లారు. ఈ సందర్భంలో బిష్ణోయ్ టోపీ నేలపై పడింది. దీన్ని గమనించిన సూర్యకుమార్ వెంటనే ఆ టోపీని తీసి, రింకు సింగ్‌కు ఇచ్చి, తర్వాత బిష్ణోయ్‌ను హగ్ చేసుకున్నారు. ఈ చర్య ద్వారా జాతీయ జెండాపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు.
సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "సూర్య అత్యంత నిస్వార్థ కెప్టెన్. ఈ యువ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నారు. వారిని ఎంతగా అర్థం చేసుకుంటారో, వారితో ఎంత బాగా బంధం ఏర్పరుచుకున్నారో ఇది చూపిస్తుంది" అని ఒక అభిమాని కామెంట్ చేశారు. మరొక అభిమాని, "ఆ టోపీని సంపాదించడానికి ఎంత కష్టపడాలి అనేది ఆయనకు తెలుసు" అని అన్నారు. మరికొందరు ఆయన్ని "నిజమైన భారత కెప్టెన్" మరియు "నిజమైన హీరో" అని పిలుస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ కేవలం క్రికెట్ మైదానంలో మంచి ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప నాయకుడు అని ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.
https://www.instagram.com/reel/DCZ-qdxzevF/?utm_source=ig_web_copy_link