బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇక మూడు ఫార్మాట్లకు ముగ్గురు?
ఒకప్పటిలా మూడు ఫార్మాట్లకు కలిపి ఒకే కెప్టెన్ ఓకే కోచ్ ఉండడం అస్సలు ఎక్కడ చూడలేకపోతున్నాము. అన్ని దేశాల క్రికెట్ జట్లకు కూడా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ముగ్గురు ప్రత్యేకమైన హెడ్ కోచ్ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే టీమిండియా మాత్రం ఇలాంటి ధోరణికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుంది. మొన్నటికి మొన్నటి టి20 ఫార్మాట్ కు సూర్య కుమార్ యాదవ్ ను.. టెస్ట్ వన్డే ఫార్మాట్లకు రోహిత్ శర్మని కెప్టెన్ గా కొనసాగించింది. అయితే మూడు ఫార్మాట్లకు ఒకే హెడ్ కోచ్ ఉండేలా చూసుకుంది. కానీ ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది.
వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్లను నియమించాలని బిసిసిఐ ఆలోచనలు ఉందట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ఓడి పోతే టెస్టులకు టి20 లకు వన్డేలకు వేరువేరుగా హెడ్ కోచ్లను నియమించాలని భావిస్తున్నట్లు ఒకటాక్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు వైట్ బాల్ రెడ్ బాల్ జట్లకు బీసీసీఐ వేరువేరు ప్రత్యేకమైన హెడ్ కోచ్ లను ఎన్నడూ నియమించలేదు అని చెప్పాలి. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో చూడాలి.