బంగ్లాదేశ్ నడ్డి విరిచిన డేంజరస్ స్పిన్నర్.. అసలు ఎవరీ అల్లా గజన్ఫర్ ?
అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్‌లో అల్లాహ్ ఘజనఫర్ యువ ఆఫ్‌స్పిన్నర్ అద్భుతమైన ప్రదర్శనకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన తీసిన 6 వికెట్లు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల చరిత్రలో ఒక కొత్త రికార్డు. ఇంతకు ముందు ఈ రికార్డు బంగ్లాదేశ్‌కు చెందిన షకిబ్ అల్ హసన్ పేరిట ఉంది. ఆయన 2019 వరల్డ్ కప్‌లో సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించారు.
అఫ్గానిస్తాన్ తరఫున మొహమ్మద్ నబి బంగ్లాదేశ్‌కు చెందిన నజ్ముల్ హోస్సెయిన్ షాంటోను 47 పరుగులకు అవుట్ చేసిన తర్వాత, అల్లాహ్ ఘజనఫర్ బౌలింగ్‌కు వచ్చారు. ఆయన వెంటనే మెహిదీ హసన్‌ను అవుట్ చేసి బంగ్లాదేశ్ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత ఆయన ముషఫిఖుర్ రహీమ్‌ను స్టంపింగ్ ద్వారా, రిషాద్ హోస్సెయిన్ను ఎల్బీడబ్ల్యూగా, తస్కిన్ అహ్మద్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేసి బంగ్లాదేశ్ జట్టును కుంగదీశారు. చివరగా షరీఫుల్ ఇస్లాంను అవుట్ చేసి తన వికెట్ల సంఖ్యను ఆరుకు చేర్చారు.
అల్లాహ్ ఘజనఫర్ అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు ఒక కొత్త ఆశగా మారుతున్నాడు. ఎత్తైన శరీరం, కుడి చేతితో విసరే ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యేకత కలిగిన అల్లా గజన్ఫర్, 2024 మార్చిలో అయర్లాండ్తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన మొదటి రెండు మ్యాచ్‌లలో వికెట్లు పడగొట్టలేకపోయినప్పటికీ, సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులకు 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు.అల్లా గజన్ఫర్ తన అన్ని వన్డే మ్యాచ్‌లు శారజాలోనే ఆడాడు. ఆరు మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌పై తాను చేసిన అద్భుత ప్రదర్శన అతని కెరీర్లో ఒక మలుపు. అతను అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు భవిష్యత్‌లో టాలెంటెడ్ స్టార్ గా మారే అవకాశం ఉంది.