చంద్రబాబు సంచలనం.. కేబినెట్ నుంచి నలుగురు ఔట్..?

ఏపీ క్యాబినెట్ నుంచి నలుగురు మంత్రుల ఉద్వాసన తప్పదా? అందులో ఒక జనసేన మంత్రి ఉన్నారా? నాగబాబు తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎంట్రీ ఇవ్వనున్నారా? వీరిద్దరితో పాటు మరో బిజెపి నేతకు చాన్స్ దక్కనుందా? ఇలా రకరకాల ప్రచారం నడుస్తోంది.



ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే పాలన కుదుటపడుతోంది. ఇటువంటి సమయంలోనే మంత్రుల తొలగింపు ఒక వార్త హల్చల్ చేస్తోంది.  జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి ఇచ్చారు.  ఒక పోస్టు ఖాళీగా ఉంచారు. ఇప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయనున్నారు.  అయితే ఒక్క నాగబాబు కాదు… ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది.


ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పదిమందికి మంత్రి పదవులు ఇచ్చారు. మూడు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. పనితీరు బాగా లేకుంటే మార్చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరిద్దరు మంత్రుల వ్యవహార శైలి పై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రుల ఉద్వాసన ఉంటుందని ఒక ప్రచారం బలంగా నడుస్తోంది.  


ఏపీ క్యాబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా అటువంటి కసరత్తులు ఏమీ జరగడం లేదు. ప్రస్తుతం నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే కచ్చితంగా ఆరు నెలల్లోగా చట్టసభలకు ఎన్నిక కావాలి. అయితే పవన్ కళ్యాణ్ అభిప్రాయం వేరేలా ఉందట. నాగబాబును ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.  ఈ లెక్కన మార్చి తరువాతే నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది జరగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నలుగురు మంత్రుల ఉద్వాసన అనేది ఫేక్ న్యూస్ గా అభివర్ణిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: