టీమిండియా ఘోర ఓటమి.. రోహిత్ కెప్టెన్సిపై శిఖర్ ధావన్ కామెంట్స్ వైరల్?

praveen
వరల్డ్ క్రికెట్లో ఉన్న అగ్రశ్రేణి టీమ్స్ లో అటు టీమిండియా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఏకంగా పటిష్టమైన జట్టుగా పేరున్న టీమిండియా ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడే ఇలాంటి ప్రదర్శన చేస్తూ ఉంటుంది. అలాంటిది స్వదేశంలో టీమిండియాను దెబ్బ కొట్టే మరో టీం అటు ప్రపంచంలోనే లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 సొంత గడ్డపై అంత పటిష్టంగా ఉంటుంది భారత జట్టు. మహా మహా టీం సైతం మట్టి కరిపించి  అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉంటుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా విజయాలతో రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. అలాంటి టీమిండియా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం చతికిలబడిపోయింది. ఎక్కడ పోటీ ఇవ్వలేక వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఓడిపోయి ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజార్చుకుంది. దశాబ్ద కాలం తర్వాత టీమ్ ఇండియా ఇంతటి ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో భారత జట్టు ఓటమిని అసలు టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత ఆటగాళ్ల తీరుపై విమర్శలకు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్.

 కొంతమంది   రోహిత్ శర్మ కెప్టెన్సీ ని  టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో టోల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గెలుపోటములే కెప్టెన్సీకి కొలమానాలు కాదు. జట్టులో నాయకుడికి ఉండే గౌరవం బంధం అన్నీ కూడా కీలకమే. న్యూజిలాండ్ సిరీస్ లో ఓడినంత మాత్రాన భారత జట్టు స్థాయి తగ్గిపోలేదు. మన ఆటగాళ్లు అందరూ చాలా ప్రొఫెషనల్స్.. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో తప్పకుండా పుంజుకుంటారు అంటూ శిఖర్ ధావన్ కెప్టెన్ రోహిత్ శర్మకి మద్దతుగా నిలబడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: