పాక్‌ మీదే ఆశలు పెట్టుకున్న టీమిండియా?

frame పాక్‌ మీదే ఆశలు పెట్టుకున్న టీమిండియా?

praveen
సొంతగడ్డపై టీమిండియాకు భంగపాటు తప్పలేదు మరి. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా న్యూజిలాండ్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. అది మాత్రమే కాకుండా బెంగళూరు టెస్టులో కూడా భారత్ పరాజయం పాలై అభాసుపాలైంది. ఇకపోతే ఇంగ్లాండ్, పాక్ మ్యాచ్ ముగిసేసరికి ఐసీసీ పాయింట్ల పట్టికను అప్డేట్ చేయడం జరిగింది. టీమిండియా విజయాల శాతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు.. 74 కుపైనే ఉండగా.. ఇప్పుడు 62.82కు పడిపోవడం కొసమెరుపు. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియాకు 0.32 శాతమే తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో భారత్ 8 గెలిచి, 4 ఓడిపోయింది. ఒక టెస్టు మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది.
ఆస్ట్రేలియా విషయానికొస్తే, 12 మ్యాచ్‌ల్లో 8 గెలవగా.. 3 మాత్రమే ఓడి ఒకటి డ్రా అనిపించుకుంది. మరోవైపు 55.56 విజయశాతంతో శ్రీలంక 3వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 55.56 శాతంతో నాలుగో స్థానానికి పరిమితం అయింది. సౌతాఫ్రికా విషయానికొస్తే, 47.62 విజయ శాతంతో ఐదో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు కివీస్‌లో వరుసగా 2 టెస్టుల్లో ఓటమితో భారత్ ఫైనల్ చేరడం కష్టంగా అనిపిస్తోంది. ఇన్ని రోజుల వరకు భారత్, ఆసీస్ దాదాపు ఫైనల్ చేరినట్లు అంచనా వేయగా.. ఇప్పుడు మిగతా టీమ్స్ కూడా రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు.. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కీలకంగా మారిందని చెప్పొచ్చు.
ఆస్ట్రేలియాకు అయితే 88 శాతం ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తర్వాత సౌతాఫ్రికాకు 53 శాతం, భారత్ కి మాత్రం ఫైనల్ చేరేందుకు 32 శాతం మాత్రమే అనుకూలం ఉందని అంటున్నారు. సొంతగడ్డపై భారత్‌తో 5 టెస్టులు, శ్రీలంకలో 2 టెస్టులు ఆడాల్సి ఉంది. దీంట్లో 4 గెలవడం ఆసీస్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు... అదే సమయంలో సౌతాఫ్రికా- దక్షిణాఫ్రికాకు మంచి ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పాక్, సౌతాఫ్రికాను ఓడిస్తే మాత్రం భారత్‌కు అవకాశాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఆయాదేశాలపై భారత్ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతోంది. భారత్ ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా కనీసం కొన్ని మ్యాచ్‌లు గెలిచి.. సౌతాఫ్రికాను, పాక్ ని ఓడిస్తే మాత్రం గెలుపు అవకాశాలు ఉండొచ్చు... లేదంటే మాత్రం భారత్ ఈ సిరీస్ పైన ఆశలు వదులుకోవడం మంచిది అని టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: