టీమిండియా గురించి మాట్లాడటం నిషేధం.. సంచలన నిజం చెప్పిన పాక్ కెప్టెన్?

praveen
ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉత్కంఠ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కేవలం ఆ రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే మ్యాచ్ వీక్షించడం చూస్తూ ఉంటాం. కానీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే క్రికెట్ ప్రపంచం మొత్తం అన్ని పనులను పక్కన పెట్టేసి.. ఈ మ్యాచ్ చూడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే ఈ దయాదుల పోరును హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.

 అయితే భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇక ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచులు జరగడం చూస్తూ ఉన్నాం. అయితే ఎన్నిసార్లు మ్యాచులు జరిగిన కూడా ఉత్కంఠ మాత్రం ప్రతిసారి రెట్టింపు అవుతూ వస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ తగ్గదు. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ప్రేక్షకులకు మాత్రమే కాదు.. గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లకి కూడా ఒత్తిడి తీవ్రంగానే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇండియాతో మ్యాచ్ గురించి ఇటీవల పాకిస్తాన్ కెప్టెన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో భాగంగా భారత్ ఏ తో పాకిస్తాన్ ఏ జట్టు ఈనెల 19వ తేదీన తలబడబోతుంది. ఈ నేపథ్యంలో తమ డ్రస్సింగ్ రూమ్ లో టీమిండియా గురించి మాట్లాడటం నిషేధించాము అంటూ పాకిస్తాన్ ఏ జట్టు కెప్టెన్  మహమ్మద్ హరీస్ చెప్పుకొచ్చాడు. టీమిండియా తో ఆట అంటేనే తమకు ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందని.. అందుకే టీమిండియా గురించి డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించుకోవడంపై నిషేధం విధించినట్లు చెప్పుకొచ్చాడు. కాగా తిలక్ వర్మ కెప్టెన్సీలో ఇండియా ఏ జట్టు బరిలోకి దిగుతూ ఉండగా జట్టులో అభిషేక్, రాహుల్ చాహర్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: