మళ్లీ టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాలో జరగబోయే టెస్ట్ మ్యాచ్‌లలో ఒకదానికి మిస్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి రావచ్చని తెలుస్తోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, "రోహిత్ శర్మ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఒకదాన్ని మిస్ కావొచ్చని మాకు తెలిసింది. కానీ ఇంకా పూర్తిగా స్పష్టత లేదు." అని తెలిపారు.
రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లే టెస్ట్ మ్యాచ్‌ను మిస్ చేసుకుంటే, టీమిండియాకు కొత్త కెప్టెన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ అబ్సెన్స్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు మరోసారి చేపట్టే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. విరాట్ కోహ్లీ గతంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కెప్టెన్‌గా లేనప్పటికీ, జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అవసరం అయితే ఒక టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడానికి ఆయన అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయనకు కెప్టెన్‌గా ఉండటం కొత్తేమీ కాదు. రోహిత్ శర్మ ఆడకపోతే, విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయడం మంచి ఆలోచన అని చాలామంది అనుకుంటున్నారు.
మరోవైపు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా ఉండాలని ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన ఇంతకు ముందు ఒక టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి, ఆస్ట్రేలియాలో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు కూడా ఆయన్ని కెప్టెన్‌గా ఎంచుకోవచ్చు. శుభ్ మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంచుకునే ఛాన్స్ లేకపోయినా ఆయనకూ అవకాశం ఉంది. ఆయన టీ20 మ్యాచ్‌లలో భారత జట్టుకు ఉప కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి, ఒక టెస్ట్ మ్యాచ్‌కు ఆయన్ని కెప్టెన్‌గా చేయడం సాధ్యమే. చూడాలి మరి విరాట్ కోహ్లీ మరొకసారి కెప్టెన్సీ పగ్గాలు చేపడతారో లేదో. ఒకవేళ అతడు కెప్టెన్ అయితే మాత్రం విరాట్ కోహ్లీ అభిమానులు చాలా సంతోషిస్తారు. కోహ్లీ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ కెప్టెన్సీ పదవిలో చక్కగా పర్ఫార్మ్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: