రూ.2500 కోట్లు పెట్టి....IPL ను ఆదుకున్న మొనగాడు?

Veldandi Saikiran
ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టాటా గ్రూప్ అండ్ టాటా సన్స్ కు గౌరవ్ చైర్మన్ గా ఉన్న అతను భారతదేశ పారిశ్రామిక పురోగతికి ఎంతో కృషి చేశాడు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్న రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు సంతాపం తెలపడం జరిగింది. అంతేకాదు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా, వ్యాపార దిగ్గజంగా పేరు సంపాదించుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధాలు ఉన్నాయి. సినిమాలు అంటే ఇష్టం ఉన్న అతను ఓ సినిమాను కూడా నిర్మించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ అనే సినిమాకు రతన్ టాటా ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ ఐపీఎల్ కు టాటా స్పాన్సర్ షిప్ చేస్తోంది.

వివోతో బీసీసీఐ వివాదం నేపథ్యంలో స్పాన్సర్ గా ఎవరూ వస్తారని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్న సమయంలో టాటా ముందుకు వచ్చారు. 2022-23 ఎడిషన్లకు గాను టాటా తొలిసారి స్పాన్సర్ గా వ్యవహరించారు. నాలుగేళ్ల కాలానికి రూ. 2500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.

అటు మహిళల ప్రీమియర్ లీగ్ ను టాటానే స్పాన్సర్ చేస్తుందనే సంగతి తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్, భారత స్టార్ మాజీ ఆల్రౌండర్ యువరాజు సింగ్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్, శ్రీనాథ్, సంజయ్ మంజ్రేకర్, కైఫ్ కు తమ గ్రూప్ లో ఉద్యోగాలు కల్పించారు. ఇది ఇలా ఉండగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా  అంత్య క్రియులు అధికారికంగా మహారాష్ట్ర సర్కార్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: