అశ్విన్ కొంపముంచిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. నిరాశలో ఫ్యాన్స్?

praveen
టీమిడియాలో సీనియర్ స్పిన్నర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ కేవలం బంతితో మాత్రమే కాదు బ్యాట్ తో కూడా ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లనే ఇక ఇబ్బంది పడుతూ చివరికి వికెట్ సమర్పించుకుంటే.. అశ్విన్ మాత్రం అలాంటి పిచ్ పైన సెంచరీ చేసి అదరగొడుతూ ఉంటాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా ఇదే జరిగింది.

 తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి చూపించిన అశ్విన్.. బ్యాటింగ్ లోను సత్తా చాటాడు. ఏకంగా కీలకమైన బ్యాట్స్మెన్ లే అవుట్ అయితే అటు అశ్విన్ మాత్రం సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో సెంచరీ తో పాటు ఆరు వికెట్లు రెండో టెస్టులో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇలా రెండు టెస్టుల్లో 11 వికెట్లతో పాటు ఒక సెంచరీ చేసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డును కూడా సమం చేశాడు.

 ఇద్దరు కూడా ఇప్పటివరకు 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లో అందుకున్నారు. అయితే ఇంకొక్క మ్యాన్ ఆఫ్ ది  సిరీస్ అందుకుంటే  అశ్విన్ ముత్తయ్య మురళీధరన్ ను వెనక్కి నెట్టేస్తాడు. వాస్తవానికి అశ్విన్ ఇక తాజా అవార్డుతోనే ఈ రికార్డును బ్రేక్ చేయాలి. కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అశ్విన్ కొంప ముంచింది. లేదంటే ఈ రికార్డు బ్రేక్ చేసేవాడే. గత ఏడాది వెస్టిండీస్ పర్యటనకు వేదికగా జరిగిన టోర్నీలో  అశ్విన్ పదిహేను వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇవ్వలేదు. ఇలా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
 నిర్లక్ష్యం కారణంగా ఈ అవార్డు పొందలేకపోయాడు అశ్విన్. అయితే అప్పట్లో ఆ టోర్నీకి స్పాన్సర్ చేసిన భారత కంపెనీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వలేదని విండిస్ బోర్డు తెలిపింది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కారణంగా చివరికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని దక్కించుకోలేకపోయాడు అశ్విన్. ఒకవేళ అప్పుడు అవార్డు దక్కి ఉంటే ఇక ఇప్పుడు దక్కిన అవార్డుతో మురళీధరన్ రికార్డును బ్రేక్ చేసేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: