ధోని వారసుడన్నారు.. కానీ ధోనికే షాకిచ్చిన రిషబ్ పంత్?

praveen
ఇండియన్ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1983 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియాకు ప్రపంచ కప్ ట్రోఫీ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. ఇలాంటి సమయంలో కెప్టెన్సీ అందుకున్న మహేంద్రసింగ్ ధోని తన సారథ్యంలో ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించగలిగాడు. అంతేకాదు ఇక వరల్డ్ క్రికెట్లో మిస్టర్ కూల్ కెప్టెన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బెస్ట్ ఫినిషర్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా ధోని వరల్డ్ క్రికెట్లో హవా నడిపించాడు అన్న విషయం తెలిసిందే.

 ఇంత సాధించాడు కాబట్టే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన క్రేజ్ ఇసుమంతైన తగ్గలేదు. అయితే ధోని రిటైర్మెంట్కు దగ్గర పడుతున్న సమయంలో.. ఆయన వారసుడిగా అసలు టీమ్ ఇండియాలోకి ఎవరు వస్తారు. వచ్చినా ధోని లాగా రాణించగలరా అనే అనుమానం చాలా మందిలో ఉండేది. ఆ తర్వాత కాలంలో ధోని వారసుడి లాగా భారత జట్టులోకి వచ్చాడు పంత్. ధోని లాగే వికెట్ కీపింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతూ ఉండేవాడు. మధ్యలో కొన్ని సార్లు విమర్శలు ఎదుర్కొన్న.. ఇక ధోని వారసుడు అనే పేరును మాత్రం నిలబెట్టాడు. అయితే ఇలా ధోని వారసుడిగా టీమిండియా ప్రేక్షకులకు పరిచయమైన రిషబ్ పంత్ ఇటీవలే ధోనికే షాక్ ఇచ్చాడు.

 ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టులు ఆడుతున్న రిషబ్ పంత్ ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఈ సెంచరీ తో ధోని రికార్డును బ్రేక్ చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా రికార్డ్ సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో చేసిన సెంచరీ తో ఆరు శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆరు సెంచరీల రికార్డును సమం చేశాడు. ధోని 144 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ సాధిస్తే కేవలం 58 ఇన్నింగ్స్ లోనే రికార్డు అందుకున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా మూడు సెంచరీలతో వృద్ధిమాన్ సాహ తర్వాత స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: