ఆ రోజు ఇండియాను దెబ్బ కొట్టినోడే.. ఇప్పుడు ఇంగ్లాండ్ ను కొట్టేసాడు?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులు మనసులు దోచుకునే క్రికెటర్లు చాలామంది ఉన్నారు. కానీ ఏకంగా ప్రత్యర్థి  బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే బ్యాటర్లు మాత్రం కొంతమంది ఉన్నారు. అలాంటి కొంతమందిలో మొదటి వరుసలో వినిపించే పేరు ట్రావిస్ హెడ్. ఈ పేరు వినిపించింది అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు బంతులు వేయడానికే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అతని బ్యాటింగ్ విధ్వంసానికి ఎక్కడ భారీగా పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డులు మూట కట్టుకోవాల్సిందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ అభిమానులు మ్యాచ్ ఓటమికి మేమే కారణమని అంటారేమో అనే ఆందోళన చెందుతూ ఉంటారు.

 అంతలా అతను బ్యాటింగ్ లో వీర విహారం చేస్తూ ఉంటాడు. ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నాను అనే రేంజ్ లో ఇక చితక్కొట్టుడు కొట్టి ఒకరకంగా ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడిస్తూ ఉంటాడు. అయితే ఈ బ్యాటర్ రెండుసార్లు అటు టీమిండియాకు విశ్వ విజేత అయ్యే ఛాన్స్ ని దూరం చేశాడు. అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వీరబాదుడు బాది ఆస్ట్రేలియా కు విజయాన్ని కట్టబెట్టిన ఇతగాడు.. ఇక తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లోను ఇలాంటి బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించి టీమిండియా కు వరల్డ్ కప్ గెలవాలని కలను నెరవేరకుండా చేశాడు.

 ఇలా రెండుసార్లు భారత జట్టును విశ్వవిజేతగా అవతరించకుండా ఆపిన ట్రావిస్ హెడ్ ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును దెబ్బ కొట్టాడు. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే చేదించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫుల్ ఫామ్ కనబరిస్తున్న ట్రావిస్ హెడ్* మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 129 బంతుల్లో 154 పరుగులు చేసి అజెయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా గెలుపులో కీలకపాత్ర వహించాడు. అయితే ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా తరఫున ఇదే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. 2011లో వాట్సన్ ఇంగ్లాండ్ పై 161 పరుగులు చేయగా ఇది అత్యధిక స్కోరుగా మొదటి స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: