సూర్య క్యాచ్ ని కాపీ కొట్టబోయి.. పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్?
అసలు విషయం ఏమిటంటే, వీరు మళ్ళీ పులిని చూసి నక్క వాతపెట్టుకున్న మాదిరి వ్యవహరించారు. టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్బుతమైన క్యాచ్ ను కాపీ కొట్టబోయి, బక్కబోర్లా పడ్డాడొక ప్లేయర్. ప్రస్తుతం పాకిస్థాన్లో ఛాంపియన్స్ వన్డే కప్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసినదే. అందులో భాగంగా డాల్ఫిన్స్ వర్సెస్ లేక్ సిటీ పాంథర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్ లో డాల్ఫిన్స్ బ్యాటర్ మహ్మద్ అఖ్లాక్ బ్యాటింగ్ చేస్తుండగా, ఉసామా మీర్ 18వ ఓవర్ వేస్తున్నాడు. ఉసామా వేసిన రెండో బంతిని అఖ్లాక్ భారీ షాట్ కొత్తగా బాల్ సరాసరి స్టాండ్స్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న సైమ్ అయూబ్, బంతిని సూర్య కుమార్ స్టైల్లో క్యాచ్ అందుకోవాలని ట్రై చేసాడు. కానీ చేతకాలేదు.. కట్ చేస్తే, బ్యాలెన్స్ తప్పడంతో బక్కబోర్లా పడ్డాడు. ఇక బంతి కాస్త బౌండరీ లైన్ లో పడింది. దాంతో ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆయూబ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సూర్య కుమార్ క్యాచ్ కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైయ్యావ్ కదా బ్రో అంటూ విమర్శలు చేస్తున్నారు.