మా దేశానికి రాకపోతే జరిగేది అదే.. టీమిండియాకు పాకిస్తాన్ మాజీ వార్నింగ్?
అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలు అన్నీ కూడా పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉండటం గమనార్హం. గతంలో ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉండగా.. ఆసియా కప్ ను పాకిస్తాన్ తో పాటు తటస్థ వేదికపై నిర్వహించాలి అంటూ బీసీసీఐ డిమాండ్ చేసింది. అలా అయితేనే తాము టోర్నీలో పాల్గొంటామని లేదంటే తప్పుకుంటాము అంటూ స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చివరికి భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై ఏర్పాటు చేశారు అని చెప్పాలి. అయితే 2025 ఏడాదిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాము పాకిస్తాన్ వెళ్లే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది.
ఇలా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి భారత ఆటగాళ్ల రక్షణను ప్రమాదంలో పెట్టలేము అంటూ స్పష్టం చేసింది. కానీ టీమిండియా పాకిస్తాన్ పర్యటనకు రావాలని ఆ దేశ మాజీ క్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయం పై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా టీమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు రాజకీయ అంశాలతో క్రికెట్కు అంతరాయం కలగకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. టీం ఇండియా తమ దేశంలో పర్యటించకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్ళదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2008 తర్వాత నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్లో పర్యటించలేదు అన్న విషయం తెలిసిందే