ధోని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ కు గుడ్ భై చెప్పినట్టేనా..?

Divya
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ మరి కొన్ని నెలల రాబోతోంది. అందుకు తగ్గట్టుగానే సన్నాహాలు మొదలవుతున్నాయి.. ఇలాంటి తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పెట్టిన ఒక పోస్ట్ ధోని అభిమానులను ఆందోళనకు గురయ్యాలా చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే ధోని రానున్న సీజన్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా ధోని ఐపీఎల్ సీజన్ కు కూడ గుడ్ భై చెప్పబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో మేజర్ మిస్సింగ్ అనే ఒక క్యాప్షన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఇందులో ధోని వేసుకొనే టీ షర్ట్ నెంబర్ 7 జెర్సీను కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ ట్విట్ చేసిన అభిమానులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. గతంలో ధోని రిటైర్మెంట్ తీసుకుంటారని అనుమానాలు నిజమవుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ధోని కోసం చెన్నై ఫ్రాంచైజీ  ఒక పాత రూల్ ని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసంBCCI నీ కూడ కోరినట్లు సమాచారం.

ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న ప్లేయర్లను అనమకా ప్లేయర్గా పరిగణిస్తారట.. 2018 వరకు ఇది అమలులో ఉన్నది. కానీ ఇప్పుడు ఈ రూల్ ధోని కోసం తీసుకురావాలని సీఎస్కే టీమ్ డిమాండ్ చేస్తున్నది. అయితే ఈ విధానాన్ని చాలా ఫ్రాంచైజీ లు వ్యతిరేకిస్తున్నాయట.. గతంలో ధోని కీళ్లనొప్పుల కారణంగా కెప్టెన్సీ ని అలాగే బ్యాటింగ్ ఆర్డర్ ను కూడా మార్చుకున్న సంగతి తెలిసిందే. కేవలం ధోని దృష్టి వికెట్ కీపింగ్ పైనే పెట్టి అప్పుడప్పుడు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. ధోని కొన్ని వైద్యుల సలహా తీసుకొని స్టేడియం లోకి అడుగుపెడుతున్నారని రూమర్ కూడా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే.. సీఎస్కే నుంచి 234 మ్యాచులు ఆడి 4,669 రన్స్ చేశారు ఇక ఓవరాల్ గా 264 మ్యాచులు ఆడి 5,243 పరుగులు తీసి రికార్డులు సైతం సృష్టించారు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: