హిస్టరీలో ఫస్ట్ టైం.. పడిపోయిన ఐపీఎల్ విలువ?
అప్పుడెప్పుడో ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు ఏకంగా వరల్డ్ క్రికెట్లోనే ఎంతో ప్రత్యేకమైన టోర్నీగా నిలిచింది అని చెప్పాలి. అందుకే ఇక ఈ టోర్నీలో పాల్గొనాలని ఎంతోమంది మహా మహా ప్లేయర్లు సైతం ఆశపడుతూ ఉంటారు. ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఏకంగా దేశం తరఫున ఆడే మ్యాచ్లను సైతం పక్కన పెట్టేందుకు సిద్ధమవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఆటగాళ్లకు ఐపీఎల్లో పాల్గొనడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం కూడా దక్కుతూ ఉంటుంది. ఒకరకంగా వరల్డ్ క్రికెట్లో ఏ టి20 లీగ్ లో దక్కని పారితోషకం.. అటు ఐపీఎల్లో ఆటగాళ్లు సొంతం చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.
ప్రతి ఏడాది కూడా అటు ఐపిఎల్ బ్రాండ్ విలువ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. కానీ చరిత్రలో తొలిసారి ఈ టి20 టోర్ని ఎంటర్ప్రైస్ విలువ పడిపోయింది. ఈ విషయాన్ని D&p రిపోర్టు పేర్కొంది. గత ఎడారి 92,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఐపిఎల్ విలువ 10.6% తగ్గి 82,700 కోట్ల రూపాయలకు చేరిందని వెల్లడించింది. డిస్నీ, రిలయన్స్ విలీనం ప్రసార హక్కులను వారి వద్ద ఉండటం.. మీడియా హక్కులకు పోటీ తగ్గడం.. ఇలాంటివి ఇందుకు కారణం అంటూ చెప్పుకొచ్చింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజ్జి అని ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది.