T20ల్లో సంచలనం.. 10 బంతుల్లోనే విజయం?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అని చెబుతూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే టార్గెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంతో క్రీజ్ లోకి వచ్చే ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతినుంచే వీరబాదుడు బాదాలి అనే మైండ్ సెట్ తో ఉంటాడు. అందుకే సిక్సర్లు ఫోర్లతో బ్యాట్స్మెన్ లు సెలరేగిపోతూ ఉంటారు అని చెప్పాలి. బౌలర్లపై పూర్తి ఆదిపత్యం చెలా ఇస్తూ ఉంటారు. కొంతమంది బ్యాట్స్మెన్లు అయితే బ్యాటింగ్ లో వీర విహారం చేస్తూ ఉంటే..  బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అందుకే టి20 ఫార్మర్ లో ఎంతో మంది బ్యాట్స్మెన్లు ఇలా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి.. ఇక తమ టీం భారీ స్కోరు నమోదు చేసేలా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా బ్యాట్స్మెన్ ల విధ్వంసానికి మారుపేరైన టి20 ఫార్మాట్లో కూడా కొన్ని టీమ్స్ దారుణంగా విఫలమై చెత్త రికార్డులు మూటగట్టుకుంటూ ఉంటాయి. కనీసం డబుల్ డిజిట్ స్కోర్ ని కూడా దాటలేక చతికిల పడిపోతూ ఉంటాయి. ఇలా బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కూలిపోవడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. ఇటీవల ఇలాంటిదే జరిగింది  కేవలం 17 పరుగులకే ఒక జట్టు ఆల్ అవుట్ అయింది. దీంతో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

 ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫైయర్ మ్యాచ్లో మంగోలియా వర్సెస్ హాంగ్కాంగ్ జట్ల మధ్య పోరు జరిగింది  ఈ క్రమంలోనే 20 ఓవర్లకు గాను 14.2 ఓవర్లు ఆడిన మాంగోలియా జట్టు కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. అంతేకాదు  ఆ జట్టులో నలుగురు బ్యాట్స్మెన్లు డక్ అవుట్ కాగా మిగతా అందరూ సింగిల్ డిజిట్ దాటలేదు. ఆ తర్వాత  10 బంతుల్లోనే 18 పరుగులు చేసిన హాంకాంగ్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. ఇది అత్యంత వేగమైన ఛేజ్ కావడం విశేషం. అలాగే ఇంటర్నేషనల్ టి20 లో ఇది మూడో అత్యంత స్వల్పస్కోరు. గతంలో ఆయిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10  మంగోలియా జట్టు 12 పరుగులకు ఆల్ అవుట్ అయి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: