హర్ష భోగ్లె ఐపీఎల్ ఆల్ టైం ఎలెవన్ జట్టు.. ఇంతకీ కెప్టెన్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఎంతోమంది ఆటగాళ్లు ఎన్నో ఏళ్ల పాటు వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించి తమ ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. అంతేకాదు ఎన్నో అరుదైన రికార్డులు కూడా క్రియేట్ చేసి ఐపీఎల్ లెజెండ్స్ గా ఎదిగిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడూ వాళ్ళు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయా ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడిన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఇండియాలో 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి నడుస్తూ ఉంది.
ఇలాంటి సమయంలో ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు ఐపీఎల్ హిస్టరీలో తమ ఆల్ టైం ఫేవరెట్ ఎలెవన్ జట్టు ఏది అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉండడం ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ కామంటేటర్ హర్ష భోగ్లే తన ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ జట్టును ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్, పొలార్డ్ వంటి ప్లేయర్లకు చోటు ఇవ్వలేదు. కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేశాడు హర్ష భోగ్లే. అయితే ఐదు సార్లు ముంబైకి టైటిల్స్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కొనసాగిన రోహిత్ ను పక్కన పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.