ఆ రోజు కేఎల్ రాహుల్ ను తిట్టడంపై.. స్పందించిన LSG ఓనర్?

praveen
బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ క్రికెట్ లో రిచేస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఏకంగా 10 టీమ్స్ ఐపీఎల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ టైటిల్ గెలవాలి అనే కోరికతో ఉండే ఫ్రాంచైజీ యాజమాన్యాలు కొన్ని కొన్ని సార్లు తమకు కప్పు అందిస్తాడు అని నమ్మకం ఉన్న ఆటగాడికి కెప్టెన్సీ అందించడం చేస్తూ ఉంటాయి.

 ఒకవేళ ఇలా భారీ నమ్మకం పెట్టుకున్న ఆటగాడు కెప్టెన్సీ చేయడం విషయంలో విఫలమైతే ఇక ఫ్రాంచైజీ ఓనర్లు వారికి క్లాస్ పీకడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఒకవేళ జట్టు విఫలమైనప్పుడు కెప్టెన్ కి క్లాస్ పీకిన అది కేవలం డ్రెస్సింగ్ రూమ్ లో.. అంటే కెమెరాల కంటపడకుండా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో మాత్రం లక్నో కెప్టెన్గా కొనసాగిన కేఎల్ రాహుల్ విషయంలో అలా జరగలేదు. ఏకంగా లక్నో జట్టు ఓనర్గా కొనసాగుతున్న సంజీవ్ గోయాంక జట్టు వైఫల్యం పై కెప్టెన్ కే ఎల్ రాహుల్ ను కెమెరాలు ముందే నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ ను అటు డగ్ అవుట్ లోనే తిడుతూ కనిపించాడు లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక. అయితే ఇక ఈ వీడియో సంచలనంగా మారిపోయింది.ఈ వాగ్వాదంపై ఇటీవలే లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక స్పందించాడు. జట్టులో ఒకరు విఫలమైతే అర్థం ఉంది. కానీ 11 మంది విఫలం కావడం ఏంటి. అందుకే దీనిపై నేను కేఎల్ రాహుల్ను ప్రశ్నించాను. ఎవరైనా వచ్చి ఈరోజు చెత్తగా ఆడాం అంటే నాకు నచ్చదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. లేదంటే ఎప్పటికీ విజయం సాధించలేము. ముంబై ఇండియన్స్ లాగా ఓటమిని ఒక పట్టాన స్వీకరించకూడదు అంటూ సంజీవ్ గోయాంక వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: