మీ కెరియర్ లో టఫెస్ట్ బ్యాటర్ ఎవరు.. బుమ్రా సమాధానం ఏంటంటే?

praveen
వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది స్టార్ బాట్స్ మెన్లు ఉంటారు. ఇక ఒక్కసారి మైదానంలో కుదురుకున్నారు అంటే చాలు పరుగుల వరద పారిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అలాంటి స్టార్ బ్యాట్స్మెన్లను సైతం భయపెట్టే బౌలర్లు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో టీమ్ ఇండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్న ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జస్ ప్రీత్ బుమ్రా తన ఆట తీరతో ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేశాడు.

 పదునైన యార్కర్లు వేస్తూ ఏకంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తిస్తూ ఉంటాడు. అయితే బుమ్రా బౌలింగ్ వేయడానికి వస్తున్నాడు అంటే చాలు పరుగులు చేయడం మాట దేవుడెరుగు వికెట్ కోల్పోకుండా కాపాడుకోవాలని స్టార్ బ్యాట్స్మెన్లు సైతం అనుకుంటూ ఉంటారు  అయితే ఇలా బ్యాట్స్మెన్లను భయపెట్టే బౌలర్లకు సైతం టఫ్ ఫైట్ ఇచ్చే బ్యాట్స్మెన్లు కొంతమంది ఉంటారు. ఈ క్రమంలోనే ఇక స్టార్ ప్లేయర్లకు కొన్ని కొన్ని సార్లు ఇంటర్వ్యూలలో ఇదే విషయంపై ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 మీ కెరియర్ లో మీరు ఎదుర్కొన్న టఫ్ఫెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అనే ప్రశ్న బుమ్రాకు ఎదురయింది. దీనికి బుమ్రా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు  తను ఎవరికి భయపడనని.. బ్యాటర్లు తన మీద డామినేషన్ చూపించే చాన్స్ ఇవ్వను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నకు నేను మంచి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నా. కానీ నిజం ఏంటంటే ఏ బ్యాటర్ కూడా నా మీద ఆధిపత్యం చూపించకుండా చూసుకుంటా. అందుకు తగ్గట్లుగా నా మైండ్ ను ముందే ప్రిపేర్ చేస్తా. ప్రతి బ్యాటర్ ను నేను గౌరవిస్తా. కానీ నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తే ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఆపలేరని నేను చెప్పుకుంటూ ఉంటా అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: