అందుకే ఐసీసీ చైర్మన్ గా జై షా.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన జానీ గ్రేవ్?

praveen
ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీగా కొనసాగుతున్న జై షా మరికొన్ని రోజుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నాడు అంటూ చర్చ జరుగుతుంది. అయితే ఎన్నో రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉండగా.. ఇక ఇప్పుడు జై షాకి ఐసీసీ చైర్మన్ పదవి కన్ఫార్మ్ అయిపోయింది అన్నది తెలుస్తూ ఉంది. కాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పదవి చేపట్టేందుకు జై షాకు ఇప్పటికే పూర్తిస్థాయి మద్దతు ఉండడంతో ఆయనే తప్పకుండా పదవి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు  కూడా అంచనాలు వేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీగా భారత క్రికెట్లో ఎన్నో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చిన జైషా ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరల్డ్ క్రికెట్లో కూడా ఇలా మార్పులు తీసుకువచ్చి మరింత నాణ్యమైన క్రికెట్ను ప్రేక్షకులకు అందించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి. అయితే బిసిసిఐ సెక్రటరీ జైషా ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడం గురించి ఎంతోమంది మాజీ ప్లేయర్లు కూడా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కాగా ఇదే విషయం గురించి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షాకు ఐసిసి చైర్మన్ పదవి రావడానికి గల కారణాలు చెప్పుకొచ్చాడు  ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్ క్లే మరోసారి పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే జై షాకు ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఛాన్స్ వచ్చింది అంటూ జానీ గ్రేవ్ వెల్లడించారు. అంతర్గత రాజకీయాలపై ఐసీసీ ఎక్కువ సమయం వృధా చేయదలచుకోలేదు అంటూ జానీ గ్రేవ్ చెప్పుకొచ్చారు. అందుకే బీసీసీఐ సెక్రటరీగా సక్సెస్ అయిన జై షాను ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఎంచుకున్నారని తెలిపాడు. కాగా జైశా డిసెంబర్ ఒకటవ తేదీన ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: