అన్ని దేశాలను ఓడించిన బంగ్లాదేశ్.. ఆ రెండు దేశాలఫై మాత్రం గెలవలేదు తెలుసా?
వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ లాంటి చిన్న టీం చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును మరో చిన్న జట్టు చిత్తుగా ఓడించేసింది. అది కూడా వారి సొంత గడ్డమీదే. ఇటీవలే రావల్ పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో అసమాన్యమైన ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్ జట్టును వారి సొంత గడ్డమీద పది వికెట్ల తేడాతో దారుణంగా ఓడించింది. ఇలా పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో బంగ్లాదేశ్ పెద్ద పెద్ద టీమ్స్ ను సైతం ఓడిస్తూ అరుదైన విజయాలను సొంతం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.
కాగా వరల్డ్ క్రికెట్లో అన్ని దేశాలను ఓడించిన బంగ్లాదేశ్ రెండు దేశాలను మాత్రం ఇప్పటివరకు ఓడించలేకపోయింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, వెస్టిండీస్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై టెస్ట్ ఫార్మాట్లో విజయాలను నమోదు చేసింది బంగ్లాదేశ్. అత్యధికంగా జింబాబ్వేను ఎనిమిది సార్లు, వెస్టిండీస్ ను నాలుగు సార్లు, న్యూజిలాండ్ రెండుసార్లు ఓడించింది. కానీ ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా, ఇండియా లాంటి జట్లపై మాత్రం బంగ్లాదేశ్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. అయితే బంగ్లా ఇదే జోరున కొనసాగిస్తే రానున్న రోజుల్లో ఈ టీమ్స్ పై కూడా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.